https://oktelugu.com/

star heroes : పెళ్లి తర్వాత సినిమా కెరియర్ మారిపోయిన స్టార్ హీరోలు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 08:35 AM IST

    kiran abbavaram

    Follow us on

    star heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఎపుడైతే వాళ్లకు ఒక సక్సెస్ ఫుల్ సినిమా దక్కుతుందో అప్పటినుంచి వాళ్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు…ఇక ప్రస్తుతం కొంతమంది హీరోలు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తు విజయాలను సాధిస్తున్నారు…

    కొంతమంది స్టార్ హీరోలు వాళ్లకంటు స్పెషల్ ఐడెంటిటి ని సంపాదించుకోవడానికి సక్సెస్ ఫుల్ సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి అనుకున్న రేంజ్ లో సక్సెస్ లైతే దక్కవు… కారణం ఏదైనా కూడా వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు చేసిన సినిమాలు వాళ్లకు సక్సెస్ లను అయితే కట్టబెట్టవు. మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది యంగ్ హీరోలు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి అందులో ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    నాని

    నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే నాని పెళ్లికి ముందు వరకు పెద్దగా సక్సెస్ లను అయితే సాధించలేదు. ఇక ఎప్పుడైతే అతనికి పెళ్లైందో అప్పటినుంచి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా దసర, హాయ్ నాన్నా , సరిపోదా శనివారం అనే మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఆయన కొత్త తరహా కథలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నాడో అప్పటినుంచి తను సక్సెస్ సాధిస్తున్నాడు. అతనికి పెళ్లి తర్వాతే వరుసగా సక్సెసులు రావడం విశేషం…

    కిరణ్ అబ్బవరం

    రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు ఏమాత్రం సక్సెస్ అయితే దక్కడం లేదు. ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఆయన క అనే ఒక పాన్ ఇండియా సినిమాని స్టార్ట్ చేసి తొందరగా ఫినిష్ చేసి ఆ సినిమాను రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకు ఒక స్టార్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి. ఇక కొంతమంది మాత్రం కిరణ్ అబ్బవరం కి పెళ్లి తర్వాతే అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పుకుంటున్నారు. ఇక ఇది ఏమైనా కూడా పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ ను సెట్ చేసుకోవడంలో ఈ హీరోలందరూ కొంచెం కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి…