శర్వానంద్.. మల్టీ టాలెంట్ హీరో. చిన్న వయసులోనే పెద్ద పాత్రలు చేసేసిన హీరో. పైగా ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసే హీరో. అందుకే, శర్వాకి పెద్దగా హిట్లు లేకపోయినా.. స్టార్ హీరోల నెస్ట్ లెవల్ హీరోల్లో ముందువరసలో ఉంటాడు శర్వానంద్. దీనికితోడు శర్వాకి, చరణ్ దగ్గర నుండి ప్రభాస్ వరకూ ఫుల్ సపోర్ట్. పైగా చిన్న తనంలోనే మంచి పాత్రలు, మంచి సినిమాలు చేసినా అనుభవం.. మొత్తానికి ఇవన్నీ శర్వానంద్ ను ఇప్పటికీ మంచి హీరోగానే నిలబెడుతున్నాయి. హీరోలు వచ్చేవాళ్ళు వస్తున్నా.. పోయేవాళ్లు పోతున్నా.. మరో ఇరవై ఏళ్ల వరకూ హీరోగా కొనసాగే క్రేజ్ కొంతమందికే వస్తోంది. శర్వాకి కూడా ఆ క్రేజ్ ఉంది.
Also Read: బాపురే అనిపిస్తున్న మహేష్ క్రేజ్.. ఫ్యాన్స్ ఫిదా..!
అందుకే శర్వా సినిమా అంటేనే పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇక ఒకేసారి రెండు సినిమాల షూటింగులకు గుమ్మడికాయ కొట్టాడు శర్వానంద్. కాగా కొంత ప్యాచ్ వర్క్ మినహా శర్వానంద్ నటించిన “శ్రీకారం” సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. అయితే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చెయ్యాలని మేకర్స్ కిందా మీద పడుతున్నా.. అప్పటిలోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయనే నమ్మకం లేదు. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ లేకపోతే.. ఎట్టిపరిస్థితుల్లో ఫిబ్రవరిలోనైనా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు.
అయితే శర్వానంద్ ఎప్పుడో మొదలు పెట్టిన ఒక తమిళ్ మూవీ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. దీనికితోడు మరో మూవీ (“ఆడాళ్లు మీకు జోహార్లు”) కూడా వచ్చే ఏడాదే విడుదలవ్వడానికి శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మొత్తానికి 2021లో శర్వానంద్ నుండి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఐతే, అన్ని సినిమాలు ఒకే టైంలో పూర్తి కావడం.. రిలీజ్ కి కూడా అన్ని ఒకేసారి రెడీ అవ్వడంతో ఇప్పుడు శర్వాకి కొత్త సమస్య వచ్చి పడింది.
Also Read: శ్రీముఖి పర్సనాలిటీపై సద్దాం సంచలన కామెంట్స్..!
అసలుకే శర్వానంద్ రీసెంట్ గా చేసిన అన్ని సినిమాలు ఢమాల్ అనిపించుకున్నాయి కాబట్టి.. ఇప్పుడు ఈ సినిమాల రిలీజ్ ను చాల బాగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే అసలుకే మోసం వస్తోంది. మరి శర్వా ఏమి చేస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్