
Pawan Kalyan Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా ‘హరి హర వీరమల్లు’.ఈ సినిమా షూటింగ్ అనేక బ్రేకుల మధ్య కొనసాగుతుంది.ఇక ఈ సినిమా పూర్తి అవ్వడానికి కేవలం 20 శాతం మాత్రమే ఉంది.పవన్ కళ్యాణ్ ఒక నెల రోజలు డేట్స్ కేటాయిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట.మే నెలలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవలే ‘వినోదయ్యా సీతం’ రీమేక్ చిత్రాన్ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్,ఈ సినిమా తర్వాత ఏప్రిల్ 5 వ తేదీ నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.మే నెలలో OG రెగ్యులర్ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు, ఆ తర్వాతనే ‘హరి హర వీరమల్లు’ సినిమా బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేస్తాడట పవన్ కళ్యాణ్.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.అదేమిటంటే ఈ చిత్రం షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడింది అట.చాలా సన్నివేశాలకు స్వయంగా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడట.సినిమాలో ఎంతో కీలకంగా మారే ఇంటర్వెల్ సన్నివేశాన్ని పవన్ కల్యాణే తెరకెక్కించాడట.స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ కి సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చలేదని, కొన్ని మార్పులు చేయాల్సిందిగా క్రిష్ కి సూచించాడని తెలుస్తుంది.
అందుకే షూటింగ్ చాలా ఆలస్యంగా మొదలైందని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.కానీ ఇప్పటి వరకు తీసిన ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందనీ,పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని చెప్తున్నారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం మరియు మలయాళం లో కూడా ఈ సినిమా దుమ్ములేపేస్తుందనే నమ్మకం తో ఉన్నారు.మరి వారి నమ్మకాలను ఈ చిత్రం ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి.