
Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో అత్యంత నెగిటివిటీ, ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న సెలెబ్రిటీ ఎవరంటే… టక్కున అనసూయ అని చెప్పొచ్చు. అనసూయ మాటలు, చేతలతో పాటు యాటిట్యూడ్ నచ్చని చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అసభ్యకర పోస్ట్స్ పెడుతుంటారు. అమర్యాదకర బూతు కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. అనసూయ ఇతర సెలబ్రిటీల మాదిరి దీన్ని లైట్ తీసుకోదు. మితిమీరితే చర్యలకు ఉపక్రమిస్తుంది. గతంలో తన మీద అసభ్యకర పోస్ట్స్ పెట్టిన ఆకతాయిలను జైలు పాలు చేసింది. సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసి ఊచలు లెక్క పెట్టించింది.
లైగర్ మూవీ ఫెయిల్యూర్ ని ఉద్దేశిస్తూ అనసూయ ఓ ట్వీట్ చేశారు. అమ్మను తిట్టిన వాళ్లను శాపం వెంటాడింది. అందుకే డిజాస్టర్ రిజల్ట్ అని అర్థం వచ్చేలా ట్వీట్ వేసింది. ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మూడు రోజులు సోషల్ మీడియా వార్ నడిచింది. ఆ సమయంలో అనసూయ చాలా మంది మీద ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడదాం, పోస్టులు పెడదాం అనుకుంటే ప్రమాదంలో పడతారని… అనసూయ మరోసారి హెచ్చరించారు.
హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ స్నేహ మెహ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అసభ్యకర పోస్టులు పెట్టినా, ట్రోల్ చేసి వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ట్రోలింగ్ చేస్తూ, మార్ఫింగ్ ఫోటోలు పెడితే శిక్షార్హులు అవుతారని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రింట్ మీడియా కవరేజ్ ఫోటో అనసూయ షేర్ చేశారు.
ఇండైరెక్ట్ గా ట్రోలర్స్ కి ఇక మూడిందే అని వెల్లడించారు. అనసూయ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా అనసూయ యాంకరింగ్ వదిలేశారు. ఆమె పూర్తి టైం సినిమాలకు కేటాయిస్తున్నారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆమె లేటెస్ట్ మూవీ రంగమార్తాండ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. పుష్ప 2లో నటిస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటుంది. దాక్షాయణిగా పుష్ప సీక్వెల్ లో ఆమె నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అలాగే పలు ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 29, 2023