https://oktelugu.com/

Hero Nani : నాని క్లాస్ హీరోనా..? మాస్ హీరోనా..?

ఎవ్వరూ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అంచలంచెలుగా ఎదిగి స్టార్ హీరో రేంజ్ ను అందుకుంటున్న నటుడు నాని... నాని నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడిని కూడా కట్టిపడిసెలా ఆయన యాక్టింగ్ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు కామెడీ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు మాస్ సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు...

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 12:49 PM IST

    Hero Nani

    Follow us on

    Hero Nani :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న నాని ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న లాంటి రెండు వరుస భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన సరిపోదా శనివారం సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించని మేరకు సక్సెస్ సాధించిందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు.

    అయినప్పటికీ నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే నాని మరొకసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు అంటూ తన అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక మాస్ సినిమాలను చేస్తున్న నాని దసరా సినిమాతో మొదటిసారిగా మాస్ హీరోగా మారాడు. ఇక రెండోసారి చేసిన ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వడంతో నాని క్లాస్, మాస్ రెండు సినిమాలను చేస్తూ ముందుకు సాగే అవకాశాలైతే ఉన్నాయి.

    అందుకే నాని లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన అదృష్టం అంటూ ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా కోరుకుంటున్నాడు. ఇక నాని వల్ల చాలామంది కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి వస్తున్నారు. అలాగే కొత్త కథలు కూడా మెటీరియాలైజ్ అవుతున్నాయి. ఎప్పుడు మూస ధోరణి లో సాగకుండా అప్పుడప్పుడు నాని కథలను సెలెక్ట్ చేసుకొని ముందుకు సాగడం అనేది కూడా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి… ఇక నాని లాంటి స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో చాలా రోజుల నుంచి మంచి అంచనాలైతే ఉంటాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే ఆయన వరుస సక్సెస్ లను సాధిస్తుండటం అనేది కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక ఇలాంటి సినిమాలు చూసిన కూడా నాని మాత్రం తెలుగు ప్రేక్షకులందరిలో ఒక ఇంటి మెంబర్ గా మారిపోయాడు. అందుకే ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక మొత్తానికైతే నాని కొత్త దర్శకులను ఇండస్ట్రీకి తీసుకురావడమే కాకుండా మంచి కథలు కూడా ఇండస్ట్రీకి వస్తున్నాయి. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కూడా నాని చాలా వరకు సక్సెస్ అవుతున్నాడు…