Heroine Niveda Thomas : మనం ఎంతో ఇష్టపడే హీరోయిన్స్ అకస్మాత్తుగా లుక్స్ మారిపోయి, వయస్సుకు మించిన అమ్మాయిలాగా కనిపించడాన్ని చూస్తే ఏ హీరోయిన్ అభిమానికి అయినా చాలా బాధగా ఉంటుంది. ఎవరైనా ముసలోళ్ళు అవ్వాల్సిందే, కానీ చిన్న వయస్సులోనే సరైన పద్దతులను అనుసరించకుండా అంటీలు లాగా తయారైపోతున్నారు కొంతమంది యంగ్ హీరోయిన్లు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు నివేదా థామస్. నాని హీరో గా నటించిన ‘జెంటిల్ మ్యాన్’ అనే చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అంతకు ముందు ఆమె తమిళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కూడా నటించింది. అయితే మొదటి సినిమాతోనే క్యూట్ గా అందంతో, అలాగే నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నివేదా థామస్.
ఆ తర్వాత ఎక్కువగా ఆమె నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ ఇన్ని రోజులు కెరీర్ ని నెట్టుకొచ్చింది. ‘వకీల్ సాబ్’ చిత్రం లో ఈమె నటనకి ఎంత గుర్తింపు లభించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ నటన తర్వాత నివేదా థామస్ గురించే మాట్లాడుకున్నారు. ఆ స్థాయిలో ఆమె తన పాత్రకి జీవం పోసింది. ‘శాకిని డాకిని’ చిత్రం తర్వాత సుమారుగా రెండేళ్లు వెండితెరకు దూరంగా ఉంటూ వస్తున్న ఈమె, సోషల్ మీడియా లో కూడా కొంతకాలం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన ’35 చిన్న కథ కాదు’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన నివేదా థామస్ ని చూసి ఆమె అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎలా ఉండే అమ్మాయి, ఎలా అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ గా ఆకర్షణీయమైన ముఖ వచ్చస్సు తో కనిపించే నివేదా థామస్ 40 ఏళ్ళు దాటినా ఆంటీ లాగా కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క కొంతమంది అభిమానులు మాత్రం లావుగా, బొద్దుగా బాగున్నావు, ఇలాగే ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నివేదా థామస్ వయస్సు కేవలం 28 ఏళ్ళు మాత్రమే. ఈమె వయస్సులో ఉన్న హీరోయిన్స్ అందరూ ఫిట్నెస్ ని మైంటైన్ చేస్తూ, జిం లో చమట్లు చిందిస్తూ నాజూగ్గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నివేదా థామస్ కి అలాంటి అలవాట్లు లేదేమో అని ఆమె అభిమానులు అంటున్నారు. సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు రావాలంటే ఇలా ఉండకూడదని, గొప్ప క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ని కూడా లావుగా తయారయ్యారు అనే కారణంగా దర్శక నిర్మాతలు వాళ్ళను కాకుండా వేరే కొత్త హీరోయిన్స్ ని తీసుకున్న సందర్భాలు ఉన్నాయని. నివేదా థామస్ ఇలాగే ఉంటే ఆమెకి సినిమాల్లో అవకాశాలు ఎవ్వరూ ఇవ్వరంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఆమె కొత్తగా విడుదల కాబోతున్న సినిమా కోసం అలా తయారైందా, లేదా సహజం గానే లావు అయ్యిందా?, ఇవి రెండు కాకుండా ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా లావు అయ్యిందా అని ఎన్నో అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.