Nandamuri Mokshajna : నందమూరి కుటుంబ అభిమానులు మొత్తం ఎప్పటి నుండో బాలయ్య బాబు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ జాతకాలను నిక్కచ్చిగా అనుసరించే బాలయ్య, సరైన ముహూర్తం లో దింపేందుకు ఇన్ని రోజులు మోక్షజ్ఞ ని ఇండస్ట్రీ కి పరిచయం చేయకుండా దాచిపెట్టాడు. అయితే మూడేళ్ళ క్రితం మోక్షజ్ఞ లుక్స్ ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. అభిమానులకు ఆయన లుక్స్ ని చూసి ఏడవడం ఒక్కటే తక్కువ. లావుగా, పొట్ట వేసుకొని కనిపించిన మోక్షజ్ఞ ని చూసి అసలు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా, ఒకవేళ వచ్చినా ఇదే లుక్స్ తో ఉంటే సక్సెస్ అవ్వలేడని అభిమానులు అనేక కామెంట్స్ చేసారు. కానీ బాలయ్య మాత్రం మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని, భయపడాల్సిన అవసరమే లేదంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు.
దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం తయారయ్యాడు. స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తున్న ఆయన లేటెస్ట్ ఫోటోలు చూసి మూడేళ్ళ క్రితం మనం చూసిన మోక్షజ్ఞ యేనా ఇతను అని ఆశ్చర్యపోయారు. ఇలాంటి లుక్స్ తో ఒక సరైన సినిమా పడితే మొదటి సినిమాతోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి, గ్రాండ్ గా స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టేసాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిలోనే ఆయన మొదటి సినిమా ప్రారంభం కాబోతుంది. ‘హనుమాన్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. సెప్టెంబర్ 6 న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని టైటిల్ తో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
శ్రీలీల ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఆ ప్రముఖ టాలీవుడ్ హీరో మరెవరో కాదు, మోక్షజ్ఞ తండ్రి నందమూరి బాలకృష్ణ. ఇందులో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ పాత్ర ని రాసినట్టు తెలుస్తుంది. మహేష్ బాబు మొదటి సినిమా ‘రాజకుమారుడు’ లో కూడా కృష్ణ ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలయ్య కూడా మోక్షజ్ఞ సినిమాలో అలాంటి పాత్రనే పోషించబోతున్నాడు. కృష్ణ మహేష్ మొదటి సినిమాలో నటించిన వేళావిశేషం మహేష్ ని భవిష్యత్తులో పెద్ద సూపర్ స్టార్ ని చేసింది. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా మహేష్ లాగానే భవిష్యత్తులో పెద్ద సూపర్ స్టార్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రం సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట.