Mahesh Babu old man getup in Varanasi: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి… ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు 5 పాత్రల్లో కనిపించబోతున్నా. టైం ట్రావెల్ లో త్రేతాయుగానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే అతను రాముడిగా కనిపిస్తాడట. ఇక అక్కడి నుంచి వాళ్ళు మరికొన్ని యుగాలకు టైం ట్రావెల్ చేసే అవకాశమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాంటి సందర్భంలోనే ఒకానొక సమయంలో మహేష్ బాబు ముసలాయన క్యారెక్టర్ లో కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాత్ర 5 నిమిషాల నిడివితో సాగే పాత్ర కావడంతో మహేష్ ఆ క్యారెక్టర్లో ఎలా కనిపిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు చాలా యంగ్ గా కనిపించే మహేష్ బాబు ముసలిగెటప్ లో ఎలా మెప్పించబోతున్నాడు అనేది కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని చేస్తున్నాడు. కాబట్టి మహేష్ బాబు చేత చాలా గొప్ప యాక్టింగ్ చేయించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ షెడ్యూల్ ను శరవేగంగా కంప్లీట్ చేయాలని చూస్తున్న రాజమౌళి వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేసి 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నాడు…
ఇక రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమా వర్క్ లోనే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటి రాలేదు. రాజమౌళి సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలైతే కోరుకుంటారో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలను రూపొందిస్తున్నారట.
ఇక ఈ సినిమాలతో ఆయన ఎంతటి గొప్ప విజయాన్ని సాధిస్తాడు. ఫైనల్ గా తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఒక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు తనకంటూ గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…