Homeఎంటర్టైన్మెంట్Mega Alludu: మెగా ‘అల్లుడి’ని పట్టించుకోక పోవడం ఏంటబ్బా?

Mega Alludu: మెగా ‘అల్లుడి’ని పట్టించుకోక పోవడం ఏంటబ్బా?

Mega Alludu: మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ భర్తగా కల్యాణ్ దేవ్ అందరికీ సుపరిచితమే. మెగా కాంపౌండ్ సపోర్టుతో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్లోని ఎంట్రీ ఇచ్చాడు. కల్యాణ్ దేవ్ సినిమాలకు తొలి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి అండదండలు ఉన్నాయి. సినిమా కథ ఎంచుకోవడంలో, డైరెక్టర్, నిర్మాత తదితర విషయాల్లో కల్యాణ్ దేవ్ కు మెగాస్టార్ సలహాలు ఇస్తుంటారు.

కల్యాణ్ దేవ్ సినిమాలకు తనవంతు సహకారం అందించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్ గా వెళ్లి సాధ్యమైనంత వరకు అతడి సినిమాను జనాల్లోకి వెళ్లేలా ప్రమోషన్స్ చేస్తుంటారు. మెగాస్టార్ తోపాటు ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలంతా కళ్యాణ్ దేవ్ తమవంతు సహకారం అందించడంలో ముందుంటారు.

అయితే కళ్యాణ్ దేవ్ తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’ విషయంలో మెగా ఫ్యామిలీ దూరంగా ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరెవరో సినిమాలను ప్రమోట్ చేసే మెగాస్టార్, మెగా హీరోలు కల్యాణ్ దేవ్ తాజా చిత్రాన్ని పట్టించుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ కి మధ్య దూరం పెరిగిందనే గాసిప్స్ విన్పిస్తున్నాయి.

ఇలాంటి సమయంలోనే ‘సూపర్ మచ్చి’  జనవరి 14న విడుదల  అయింది.  ఈ సినిమాపై మెగా హీరోల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం.  ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీలో నటిస్తున్న కళ్యాణ్ దేవ్ సైతం ప్రమోషన్స్ లో ఎక్కడా కన్పించకపోవడం గమనార్హం. ఏదో సింపుల్ గా సోషల్ మీడియాలో మూవీ మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాకు ఖర్చు బాగానే అయినట్లు తెలుస్తోంది. ‘సూపర్ మచ్చి’కి మ్యూజిక్ సన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Rani Poonam Pandey: బూతుల రాణి పూనమ్ పాండే గురించి ఎంత అని చెప్పాలి ? ఏమి అని చెప్పాలి ? ఆమె బోల్డ్ లోకంలో తిరుగులేని మహారాణి. అయితే, ఆ మహారాణికి గతేడాది పెళ్లి అయింది. ఆమె భర్త పేరు సామ్ బాంబే. అతగాడు ఎంత ధీరుడు అంటే.. పెళ్లి అయిన మూడో రోజే బూతుల రాణి పూనమ్ పాండేని పిచ్చకొట్టుడు కొట్టాడు. తనను దారుణంగా కొడతాడా ? అంటూ కసితో రగిలిపోయి.. పూనమ్ అతన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించింది. […]

  2. […] Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విశేష అనుభవం ఉంది. నలభై ఏళ్ల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు. అపర చాణక్యుడిగా పేరుగాంచిన బాబు ప్రస్తుతం శత్రువుల పీడ వెంటాడుతోంది. ఇన్నాళ్లు ఏకచత్రాధిపత్యం వహించిన ఆయనకు పక్కలో బళ్లెంలా శత్రువులు మారారు. గతంలోనే ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు మధ్య పెద్ద రాజకీయ దుమారం రేగి కాపుల కోసం పోరాడిన ముద్రగడతో బాబుకు చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం కూడా కాపులను టీడీపీకి దూరం చేయాలనే కోణంలో ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular