Hrithik Roshan: బాలీవుడ్ హీరోల్లో అందగాడు ఎవరు అంటే.. ముందు వరుసలో చెప్పుకోవాల్సిన హీరో ‘హృతిక్ రోషన్’. అలాంటి హీరో ప్రస్తుతం సోలోగా ఉంటున్నాడు. భార్యతో విడిపోయాక, ‘హృతిక్ రోషన్’ సినిమాల పై ఫోకస్ పెట్టాడు. అయితే, ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడలేదు. మధ్యలో కొంత బ్రేక్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. మరి ఈ బ్రేక్ లోనే ‘హృతిక్ రోషన్’కి ఒక చిన్న హీరోయిన్ కనెక్ట్ అయింది.

మొత్తానికి ఈ స్టార్ హీరో మళ్ళీ డేటింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే, ‘హృతిక్ రోషన్’ డేటింగ్ చేస్తున్నాడు అంటే.. ఏ స్టార్ హీరోయిన్ అని ఊహించుకుంటారు. కానీ, ‘హృతిక్’ మాత్రం చాలా భిన్నంగా యువ నటి, సింగర్ సబా ఆజాద్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెతో డేటింగ్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెను తరుచుగా కలుస్తున్నాడు.
Also Read: ఇండియన్ ఆర్మీలో 41 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో?
ఇటీవల ముంబైలో వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. సబా ఆజాద్ ప్రస్తుతం “రాకెట్ బాయ్స్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆమె వయసు 32 సంవత్సరాలు. నిజానికి హృతిక్ రోషన్ ఏడేళ్ల క్రితం తన భార్య సుజానే నుంచి విడిపోయాడు. అప్పటి నుంచి ‘హృతిక్ రోషన్’ ఒంటరిగానే ఉంటున్నాడు.

కానీ, సుజానే మాత్రం వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఆమె అలా వేరే వ్యక్తితో కలిసి ఉండటం హృతిక్ ను బాగా డిస్టర్బ్ చేసిందట. ఆ సమయంలోనే సబా ఆజాద్ కి హృతిక్ బాగా దగ్గర అయ్యాడు అని తెలుస్తోంది.
సబా ఆజాద్ కూడా హృతిక్ పై అమితమైన ప్రేమను పెంచుకుంది అని, ఆమె మంచితనం, ప్రేమ చూసి హృతిక్ ఆమెకు కనెక్ట్ అయ్యాడని తెలుస్తోంది. ఇక హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘విక్రమ్ వేదా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Also Read: ఇండియన్ ఆర్మీలో 41 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో?