https://oktelugu.com/

Mega Alludu: మెగా ‘అల్లుడి’ని పట్టించుకోక పోవడం ఏంటబ్బా?

Mega Alludu: మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ భర్తగా కల్యాణ్ దేవ్ అందరికీ సుపరిచితమే. మెగా కాంపౌండ్ సపోర్టుతో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్లోని ఎంట్రీ ఇచ్చాడు. కల్యాణ్ దేవ్ సినిమాలకు తొలి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి అండదండలు ఉన్నాయి. సినిమా కథ ఎంచుకోవడంలో, డైరెక్టర్, నిర్మాత తదితర విషయాల్లో కల్యాణ్ దేవ్ కు మెగాస్టార్ సలహాలు ఇస్తుంటారు. కల్యాణ్ దేవ్ సినిమాలకు తనవంతు సహకారం అందించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆడియో ఫంక్షన్లు, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 6, 2022 / 06:35 PM IST
    Follow us on

    Mega Alludu: మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ భర్తగా కల్యాణ్ దేవ్ అందరికీ సుపరిచితమే. మెగా కాంపౌండ్ సపోర్టుతో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్లోని ఎంట్రీ ఇచ్చాడు. కల్యాణ్ దేవ్ సినిమాలకు తొలి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి అండదండలు ఉన్నాయి. సినిమా కథ ఎంచుకోవడంలో, డైరెక్టర్, నిర్మాత తదితర విషయాల్లో కల్యాణ్ దేవ్ కు మెగాస్టార్ సలహాలు ఇస్తుంటారు.

    కల్యాణ్ దేవ్ సినిమాలకు తనవంతు సహకారం అందించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్ గా వెళ్లి సాధ్యమైనంత వరకు అతడి సినిమాను జనాల్లోకి వెళ్లేలా ప్రమోషన్స్ చేస్తుంటారు. మెగాస్టార్ తోపాటు ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలంతా కళ్యాణ్ దేవ్ తమవంతు సహకారం అందించడంలో ముందుంటారు.

    అయితే కళ్యాణ్ దేవ్ తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’ విషయంలో మెగా ఫ్యామిలీ దూరంగా ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరెవరో సినిమాలను ప్రమోట్ చేసే మెగాస్టార్, మెగా హీరోలు కల్యాణ్ దేవ్ తాజా చిత్రాన్ని పట్టించుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ కి మధ్య దూరం పెరిగిందనే గాసిప్స్ విన్పిస్తున్నాయి.

    ఇలాంటి సమయంలోనే ‘సూపర్ మచ్చి’  జనవరి 14న విడుదల  అయింది.  ఈ సినిమాపై మెగా హీరోల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం.  ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

    ఇదిలా ఉంటే ఈ మూవీలో నటిస్తున్న కళ్యాణ్ దేవ్ సైతం ప్రమోషన్స్ లో ఎక్కడా కన్పించకపోవడం గమనార్హం. ఏదో సింపుల్ గా సోషల్ మీడియాలో మూవీ మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాకు ఖర్చు బాగానే అయినట్లు తెలుస్తోంది. ‘సూపర్ మచ్చి’కి మ్యూజిక్ సన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.