https://oktelugu.com/

Samantha : సమంత ధరించిన ఈ స్కర్ట్ విలువ ఎంతో తెలుసా..? ఆ డబ్బులతో ఒక కుటుంబం బ్రతికేయొచ్చు!

సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లను మెంటలెక్కిపోయేలా చేస్తూ ఉంటుంది.

Written By: , Updated On : February 18, 2025 / 09:27 AM IST
Samantha

Samantha

Follow us on

Samantha : సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లను మెంటలెక్కిపోయేలా చేస్తూ ఉంటుంది. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు మిలియన్ల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. ఇండియాలోనే హైయెస్ట్ ఎంగేజ్మెంట్ ఉన్న అకౌంట్ సమంత కే సొంతం. కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారానే ఆమె నెలకు కోట్ల రూపాయిలు సంపాదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె ధరించే అవుట్ ఫైట్స్, స్కర్ట్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. చాలా విచిత్రమైన మోడల్ డిజైన్స్ ని ఈమె పరిచయం చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తెల్ల స్కర్ట్ లో దర్శనమిస్తూ కొన్ని ఫోటోలను అప్లోడ్ చేయగా, ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఆమె అభిమానులు ఈ స్కర్ట్ కోసం గూగుల్ మొత్తం వెతికారు.

ఆమె ధరించిన ఈ స్కర్ట్ పేరు మిలా గ్రేడియంట్ ఫ్రిన్జ్ స్కర్ట్. ఈ స్కిట్ విలువ దాదాపుగా 33 వేల రూపాయిలు ఉంటుందట. దీనిని ఏక్తా సింగ్ అనే డిజైనర్ రూపొందించారు. ఇది మార్కెట్ లో అందుబాటులో లేదు, సమంత తన కోసం ఏక్తా సింగ్ వద్ద ప్రత్యేకంగా ఈ మోడల్ ని డిజైన్ చేసుకుంది.ఇంత ధర పెట్టి ఆమె స్థాయిలో ఉన్న సెలెబ్రిటీలు కొనుగోలు చేస్తారేమో కానీ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు కొనుగోలు చేయలేరు. ఆ 33 వేల రూపాయిలు వాళ్ళ దగ్గర ఉంటే నెల మొత్తం ఎలాంటి కష్టం లేకుండా బ్రతికేయొచ్చు. ఇకపోతే సమంత చాలా కాలం నుండి మయోసిటిస్ అనే వ్యాధి కారణంగా డాక్టర్ల సూచన మేరకు సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయింది.

రీసెంట్ గానే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్'(Citadel) వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ వెబ్ సిరీస్ కి రీమేక్ అవ్వడంతో ఈ సిరీస్ పై అంతగా ఆసక్తి చూపలేదు మన తెలుగు ఆడియన్స్. ఇక పోతే ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు లో తన సొంత నిర్మాణ సంస్థలో ఒక సినిమా చేస్తుంది. అదే విధంగా తనతో ‘ఫ్యామిలీ సీజన్ 2 ‘ తీసిన రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించబోతుంది. ఇలా వరుసగా సినిమాతో బిజీ అవుతున్న ఆమె, హిందీ లో త్వరలోనే సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. చూడాలి మరి సమంత సెకండ్ ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.