కరోనా కల్లోలంలో ఇప్పుడు హీరోల మార్కెట్లు పడిపోయాయి. థియేటర్లు తెరవకపోవడంతో ఓటీటీల దిక్కు అవుతున్నాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు పూర్తిగా ఆగిపోయాయి. ఓటీటీలు భారీ ఆఫర్లతో సినిమాలను కొనుక్కుంటున్నాయి.
దేశంలోని ప్రముఖ ఓటీటీలు ఇప్పుడు దక్షిణాది సినిమాలపై పడ్డారు. భారీ ధరలకు దక్షిణాది సినిమాలను కొనుగోలు చేస్తున్నారు. రికార్డ్ ధరలను ఆఫర్ చేస్తున్నారు.
దక్షిణ భారతదేశంలో ఇద్దరు స్టార్ హీరోలకు ఇప్పుడు హిందీ మార్కెట్ తోపాటు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పలుకుతోందట..ఏ ఇతర హీరోలకు లేని విధంగా ప్రభాస్, విజయ్ లకు దక్షిణాదిలోనే అత్యధిక రేటు ఇస్తున్నారట..
బాహుబలి సినిమాలతో ప్రభాస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఇక విజయ్ కు దక్షిణ భారత మార్కెట్ లో మంచి వాటా ఉంది. విజయ్ సినిమాలు విదేశాల్లోనూ భారీగానే ఆడుతూ సంపాదిస్తున్నాయి.
ప్రభాస్, విజయ్ ఇద్దరికి ఇప్పుడు ప్రతి సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘ఆదిపురుష్’, సాలార్ లకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు హీరో విజయ్ తాజాగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో జట్టుకట్టాడు. ఈ సినిమాతోనే విజయ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ కు దిల్ రాజు ఏకంగా రూ.100 కోట్ల రూపాయల ఆఫర్ ఇవ్వడం సంచలనంగా మారిందట.. దిల్ రాజు ఇప్పటికే అడ్వాన్సుగా విజయ్ కు రూ.10 కోట్లు చెల్లించాడనే పుకారు ఉంది.
ప్రస్తుతం దక్షిణాది హీరోల్లో మార్కెట్ తోపాటు ప్రజాదరణ పెంచడంలో ప్రభాస్, విజయ్ ఒకరితో ఒకరు పోటీపడుతూ ప్యాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు. వారి రెమ్యూనరేషన్ ఇప్పుడు సినిమా సినిమాకు భారీగా పెరుగుతోంది.