
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. సెప్టెంబర్ లో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్న ఆయన గురువారం సాయంత్రం తన ప్యానెల్ ని ప్రకటించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గడిచిన ఏడాది కాలం నుంచి ప్యానెల్ లో ఎవర్నీ తీసుకోవాలి, చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.