Corona: ఫిబ్రవరిలో కూడా వాయిదాల వడ్డింపేనా!… పవన్, రవితేజ, సూర్య రావడం కష్టమే?

Corona: గత రెండేళ్లుగా చిత్ర పరిశ్రమను కరోనా ముప్పతిప్పలు పెడుతుంది. షూటింగ్స్, రిలీజులు, సినిమా వేడుకలేవి అనుకున్న ప్రకారం జరగడం లేదు. చెప్పిన తేదీకి సినిమా విడుదల కావడం చాలా కష్టమైపోతుంది. థియేటర్లోకి సినిమా వచ్చే వరకు ప్రేక్షకుడికి నమ్మకం ఉండటం లేదు. నేడే విడుదల పోస్టర్ చూడడం గగనమైపోతుంది. 2022 సంక్రాంతి బరిలో దిగాల్సిన చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వాయిదా పడ్డాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల […]

Written By: Shiva, Updated On : January 18, 2022 12:34 pm
Follow us on

Corona: గత రెండేళ్లుగా చిత్ర పరిశ్రమను కరోనా ముప్పతిప్పలు పెడుతుంది. షూటింగ్స్, రిలీజులు, సినిమా వేడుకలేవి అనుకున్న ప్రకారం జరగడం లేదు. చెప్పిన తేదీకి సినిమా విడుదల కావడం చాలా కష్టమైపోతుంది. థియేటర్లోకి సినిమా వచ్చే వరకు ప్రేక్షకుడికి నమ్మకం ఉండటం లేదు. నేడే విడుదల పోస్టర్ చూడడం గగనమైపోతుంది. 2022 సంక్రాంతి బరిలో దిగాల్సిన చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వాయిదా పడ్డాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Corona

ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ విడుదలపై క్లారిటీ లేదు. అయితే జనవరిలో పాటు ఫిబ్రవరిలో విడుదలయ్యే చిత్రాలను వాయిదా భయం వెంటాడుతుంది. పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరిలో రావాల్సిన పెద్ద చిత్రాలన్నీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 4న రావాల్సిన ఆచార్య ఏప్రిల్ 1కి పోస్టుపోన్ చేశారు. కాగా పవన్ భీమ్లా నాయక్, నిఖిల్ 19 పేజెస్, సూర్య ఈటి, రవితేజ నటించిన ఖిలాడి, అడివి శేషు మేజర్ చిత్రాలతో పాటు అలియా భట్ నటించిన గంగూబాయి కథియావాడి చిత్రాలు ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Also Read:5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు: పోల్ సర్వేలో ఎవరిది విజయం?

అయితే వీటిలో చాలా చిత్రాలు విడుదల తేదీ వాయిదా వేసే సూచనలు కలవు. ఈటి, గంగూబాయి కథియావాడి, మేజర్ చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల కానున్నాయి. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. ఢిల్లీలో పూర్తిగా థియేటర్స్ మూసివేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా నేటి నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ విధించారు.

దీంతో ఫిబ్రవరి 25న రావాల్సిన భీమ్లా నాయక్, 11న విడుదల కావాల్సిన ఖిలాడి వాయిదా పడే సూచనలు కలవు. కరోనా ఆంక్షల మధ్య పెద్ద చిత్రాల విడుదల సాధ్యం కానీ పక్షంలో చిన్న చిత్రాలు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవచ్చు. బడా చిత్రాల వాయిదాతో ఖాళీ అయిన థియేటర్స్ చిన్న చిత్రాలతో నిండిపోవచ్చు. అయితే నైట్ కర్ఫ్యూ, యాభై శాతం సీటింగ్, టికెట్స్ ధరలు సమస్యగా భావిస్తే చిన్న చిత్రాలు కూడా విడుదల వాయిదా వేసుకోవచ్చు. ఏది ఏమైనా ఫిబ్రవరిలో కూడా వాయిదాల పర్వం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది పరిశ్రమకు ఏమాత్రం మేలు చేసే అంశం కాదు.

Also Read: ‘ఎన్టీఆర్ ఆత్మ కనపడిందట.. మాట్లాడిందట..’ లక్ష్మీపార్వత్రి ఏంటమ్మా ఇదీ!

Tags