Shankar : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన శంకర్ ప్రస్తుతం కొంతవరకు డల్ అయ్యాడనే చెప్పాలి. పాన్ ఇండియాలో మంచి డైరెక్టర్ గా పేరును సంపాదించుకోవడమే కాకుండా రోబో లాంటి సినిమాతో బాలీవుడ్ లో సైతం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే ఒక గట్టి నమ్మకంతో ఉండే ప్రేక్షకులు సైతం ఆయన నుంచి వస్తున్న సినిమాని చూడడానికి సైతం ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటే ఆయన స్టార్ డమ్ అనేది ఎంతలా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయనతో సినిమాలు చేసిన హీరోలందరు స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వాళ్ళందరు చాలా కాలంపాటు స్టార్ హీరోలుగా వెలుగొందిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన రామ్ చరణ్ ను హీరోగా పెట్టి చేసిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే గత పది సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. రోబో సినిమా తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్లుగా మారడమే కాకుండా ఆయన పేరుని కూడా చాలా వరకు చెడగొట్టాయనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ఆయనకు సక్సెస్ లు రావడం లేదు అనే విషయం మీద సరైన సమాధానాలైతే రావడం లేదు. ఇక ఇది ఏమైనా కూడా శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలు ఫ్లాప్ అవుతుండడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన సినిమాలు పెద్దగా అట్రాక్ట్ చేయడం లేదు. గత సినిమాలతో పోలిస్తే పది సంవత్సరాల నుంచి వస్తున్న సినిమాల్లో కథపరంగా చాలా వరకు తప్పులు అయితే ఉంటున్నాయి.
దానివల్ల ఆయన ఎంత విజువల్ వండర్ గా చూపించినప్పటికి ఆ సినిమా అంత బాగా ఎలివేట్ అయితే అవ్వడం లేదు. మరి ఏది ఏమైనా కూడా శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో కీలకమైన సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తద్వారా అతనికి అవకాశాలనిచ్చే స్టార్ హీరోలు కూడా కరువవుతారు.
శంకర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాడనే చెప్పాలి. ఇక ఒక్క సక్సెస్ తో మళ్ళీ తనను తాను రికవరీ చేసుకుంటాడా లేదంటే ఈ సినిమా ఫ్లాప్ తో ఇక తను సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ప్రేక్షకులకు చెప్పకనే చెబుతాడా అనేది తెలియాల్సి ఉంది…