Nagarjuna : నాగార్జునా.. పార్ట్ టైం మూవీస్

అలాంటి కథలు మాత్రమే ఇప్పుడు ప్రేక్షకులకి బాగా నచ్చుతాయి...నాగార్జున అనే కాదు ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు మారాలి...

Written By: Gopi, Updated On : January 17, 2024 8:35 am
Follow us on

Nagarjuna : సినిమా అనేది ప్రేక్షకుడిని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లాలి. అలాంటప్పుడే ఆ ప్రేక్షకుడు ఆ సినిమాని ఆదరిస్తాడు. అలా కాకుండా పాత చింతకాయ పచ్చడి కథతో సినిమాలు తీసి మసిపూసి మారేడు కాయ చేసినంత మాత్రాన సినిమాలు ఆడవు అనేది ఇప్పటికి వందకి 100 సార్లు ప్రూవ్ అయింది.

అయిన కూడా మన మేకర్స్ దానిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా వచ్చిన నా సామి రంగ సినిమా పరిస్థితి కూడా అంతే…భారీ గా జుట్టు పెంచుకొని వేట కొడవల్లు చేతిలో పట్టుకొని ఎలివేషన్ ఇస్తు, దాన్ని చూపిస్తూ కొంచెం కామెడీగా సాగుతూ ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తే చాలు సినిమాలు ఈజీగా ఆడేస్తాయి అని నమ్మే నాగార్జున అతి తెలివికి మనం జోహార్లు చెప్పక తప్పదు.

దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగార్జునకి ఏ సినిమా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది ఏ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే అది ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది అనే ఒక చిన్నపాటి స్పృహ లేకపోవడం అనేది నిజంగా చింతించాల్సిన విషయం. ఒకటి రెండు సినిమాలు తీసిన యంగ్ హీరోలు సైతం వాళ్లు ఎలాంటి స్టోరీ లు చేయాలని ఆలోచిస్తూ కంటెంట్ ఎంచుకోవడం లో చాలా షార్ప్ గా ఉంటున్నారు అలాగే వాళ్ల నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి.

కానీ నాగార్జున లాంటి హీరోస్ మాత్రం సంక్రాంతి పండగ వస్తుంది. మనం సంక్రాంతి ని బేస్ చేసుకొని సినిమా ఒకటి చేయాలనే ఆలోచన లో ఉండి నాగార్జున ఇలాంటి నాసి రకం కథలు చేస్తున్నాడు. ఇప్పుడు నాగార్జున పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పూర్తి ఫోకస్ అంతా షోల మీద పెట్టేసి తీరిగ్గా ఉన్న సమయంలో మనల్ని హీరోగా జనాలు మర్చిపోకూడదు కాబట్టి మనం ఒక సినిమా చేయాలి లేకపోతే ఆడియన్స్ కి మనకి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అనే ఉద్దేశ్యం లో ఒక రెండు మాస్ ఫైట్లు, మూడు ఎలివేషన్స్ సీన్లు, నాలుగు పాటలతో సాగే సినిమాలు చేస్తే సరిపోతుంది అనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆయనలో కనిపించిన ఫైర్ ఇప్పుడు కనిపించడం లేదు.

బహుశా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయనలో సినిమాలు చేయాలనే కోరిక తగ్గిపోతున్నట్టుగా తెలుస్తుంది. పండుగను బేస్ చేసుకొని ఒక తల తోక లేని కథ కి కొన్ని ఎలివేషన్లు జోడించి సినిమా చేసి జనాల మీదికి వదిలితే సినిమా ఆడేస్తుంది అనే రోజులు పోయాయి. ప్రేక్షకుడి అభిరుచి మారింది వాడి ఇష్టాలు మారాయి, ప్రేక్షకుడు సినిమాని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. వాడి అంచనాలు రీచ్ అవ్వాలంటే కథ కొంచం కొత్తగా ఉండాలి. చూపించే సన్నివేశాలు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడి ని ప్రతి క్షణం ఎక్జైట్ మెంట్ కి గురి చేయాలి. అలాంటి కథలు మాత్రమే ఇప్పుడు ప్రేక్షకులకి బాగా నచ్చుతాయి…నాగార్జున అనే కాదు ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు మారాలి…