Shankar : ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ గర్వించదగ్గ దర్శకులలో ఒకరు. ఆయన నుండే రాజమౌళి లాంటి దర్శకులు ఎన్నో నేర్చుకున్నారు. కమర్షియల్, ఫ్యాక్షన్, లవ్ స్టోరీస్ రాజ్యం ఏలుతున్న రోజుల్లో శంకర్ పది సంవత్సరాలు అడ్వాన్స్ గా అలోచించి ఇలాంటి కాన్సెప్ట్స్ తో కూడా సినిమాలు తీయొచ్చా అని అనిపించేంత గొప్ప చిత్రాలు తీసాడు. తన ప్రతీ చిత్రం తోనూ ఒక సందేశం ఇచ్చి జనాలను ఆలోచింపచేసేవాడు. అంతే కాకుండా టెక్నాలజీ పరంగా ఇండియన్ సినిమాని మరో మెట్టు పైకి ఎక్కించాడు. 14 ఏళ్ళ క్రితమే ఆయన రోబో లాంటి హై టెక్నాలజీ తో కూడిన సినిమా తీసాడంటేనే అర్థం చేసుకోవచ్చు శంకర్ రేంజ్ ఏమిటి అనేది. అయితే ఆ రోబో చిత్రం తర్వాతే శంకర్ కి బ్యాడ్ టైం మొదలైంది. రోబో తర్వాత ఆయన చేసిన ఐ,స్నేహితుడు, 2.0, ఇండియన్ 2, అదే విధంగా రీసెంట్ గా విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రాలు అభిమానులను ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
ఐ, స్నేహితుడు చిత్రాలు కంటెంట్ పరంగా పర్వాలేదు అనిపించాయి. కానీ 2.0 నుండి శంకర్ బుర్ర ని తన ఇంట్లో ఉన్న డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి సినిమాలు చేస్తున్నాడు అనిపించింది. సీక్వెల్ క్రేజ్ కారణంగా 2.0 చిత్రం కమర్షియల్ గా పర్వాలేదు అని అనిపించే రేంజ్ వసూళ్లను రాబట్టింది, కానీ ఆ తర్వాత వచ్చిన ఇండియన్ 2 చిత్రం థియేటర్స్ లో ఆడియన్స్ కి నరకం చూపించింది. ఫస్ట్ హాఫ్ అయ్యేలోపే నీకు నీ సినిమాకి ఒక దండం అంటూ థియేటర్స్ నుండి పారిపోయేలా చేసింది ఆ కళాఖండం. ఇక నిన్న విడుదలైన ‘గేమ్ చేంజర్’ ఆ రేంజ్ కళాఖండం కాకపోయినా, ఇది కూడా పెద్ద రాడ్డే. కథ, థీమ్, లాజిక్స్ ఇవేమి లేకుండా, మనకి బుర్ర లేదు అనుకొని ఈ సినిమాకి వెళ్తే నచ్చొచ్చు. పాపం రామ్ చరణ్ మూడేళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసాడు శంకర్.
ఈ చిత్రం లో అప్పన్న క్యారక్టర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది. చరణ్ మన తెలుగు సినిమా గర్వపడే సత్తా ఉన్నటువంటి నటుడు. అలాంటి వ్యక్తి వేగంగా సినిమాలు చేయాలి, ఇలాంటి బుర్రపాడు చేసుకున్న శంకర్ లాంటి డైరెక్టర్స్ తో చేయకూడదు అని. ‘గేమ్ చేంజర్’ చూసిన తర్వాత రామ్ చరణ్ స్థాయి ఉన్నటువంటి పాన్ ఇండియన్ డైరెక్టర్స్ ఎవ్వరూ కూడా శంకర్ తో సినిమా చేసే సాహసం చేయరు. కానీ ఈయన గతం లో రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇది పూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఉంటుందట. వాస్తవానికి ఈ సినిమా కూడా రామ్ చరణే చేయాలి. కానీ శంకర్ పనితనం ని మనోడు బాగా గమనించి తెలివిగా తప్పుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఇతన్ని ఎలా వదిలించుకుంటాడో చూడాలి.