https://oktelugu.com/

Venkatesh and Balayya : బాలయ్య, వెంకటేష్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసిన అనిల్ రావిపూడి…

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వారు స్క్రీన్ మీద ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తు సినిమాలను సూపర్ హిట్లు గా నిలుపుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 11, 2025 / 04:31 PM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh and Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వారు స్క్రీన్ మీద ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తు సినిమాలను సూపర్ హిట్లు గా నిలుపుతూ ఉంటారు… అందుకే హీరోలను మాత్రమే ఆరాధిస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా వాళ్ళకే జేజేలు కొడుతూ ఉంటారు…

    కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…ఈయన ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా వెలుగొందడమే కాకుండా అందరు హీరోలతో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్న బాలయ్య బాబు వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో సినిమాలను చేశాడు. కాబట్టి తన తదుపరి సినిమాని చిరంజీవితో చేయాలని చూస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు వెంకటేష్ ఇద్దరు యాక్టింగ్ లో చాలా వేరియేషన్స్ చూపిస్తారని ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. బాలయ్య బాబు అంటే పూర్తిగా మాస్ క్యారెక్టర్ లో కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అంటూ చెప్పడు. ఇక బాలయ్య బాబుని చూపించడం అనేది ఒక కళ అని చెప్పాడు. ఎందుకంటే స్క్రీన్ మీద ఆయనను చూసే అభిమానులు ఊగిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఎమోషన్ ని టచ్ చేస్తూ బాలయ్య బాబు సినిమా థియేటర్లో కనిపిస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ ఆయన తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.

    మరి ఇప్పటివరకు అలాగే వెంకటేష్ ని కూడా చాలా కామెడీ క్యారెక్టర్ లో సెంటిమెంటల్ సినిమాలో చూపించిన ఆయన ఇక మీదట చేయబోతున్న సినిమాల్లో కూడా తన హీరోలను చాలా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈయన చేసే సినిమాలతో భారీ విజయాలను సాధించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆయన ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…అయితే వెంకటేష్ మాత్రం ఎలాంటి క్యారెక్టర్ ను అయిన సరే ఆయన ఈజీగా చేసేస్తాడు. ఆయనలో ఒక మేనరిజం ను పట్టుకొని మనం చేయగలిగితే వెంకటేష్ గారు చాలా ఫన్ క్రియేట్ చేయగలుగుతారు. అలాగే ఎమోషన్స్ ని కూడా చాలా సెన్సిటివ్ గా పలికిస్తారు అంటూ ఆయన వెంకటేష్ ని ఆకాశానికి ఎత్తేశారు.

    మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వబోతున్న నేపధ్యం లో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా చాలావరకు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయనే చెప్పాలి…