Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ 16 షూట్ కి సర్వం సిద్ధం చేశారా..? రెగ్యులర్ షూట్...

Ram Charan: రామ్ చరణ్ 16 షూట్ కి సర్వం సిద్ధం చేశారా..? రెగ్యులర్ షూట్ జరిగేది అప్పుడేనా..?

రంగస్థలం సినిమాతో తనలోని నటన ప్రతిభను బయటకు తీసిన నటుడు రామ్ చరణ్... ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఒక సినిమా తర్వాత మరొక సినిమాని రిలీజ్ చేసే ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది... త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకున్న ఆయన గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు...

Ram Charan: రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక వాటన్నింటికీ తగ్గట్టుగానే ఈ సినిమాని రూపొందిస్తున్నారని బుచ్చిబాబు ఇంతకుముందే చాలా క్లారిటీగా చెప్పారు. అయితే ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు చాలా కొత్త కథని రెడీ చేసి ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దానికోసం రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే బుచ్చిబాబు ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన ఉప్పెన లాంటి తెలుగు కు మాత్రమే పరిమితమైన సినిమాలు చేసే సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది. ఇంకా చాలా రోజుల కిందటే ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకున్నప్పటికీ రెగ్యూలర్ సినిమా షూటింగ్ మాత్రం జరగడం లేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.

కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బుచ్చిబాబు సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక డిసెంబర్ 20 తేదీన ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా రిజల్ట్ ని చూసి ఈ సినిమాలో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి ముందుకు సాగాలని రామ్ చరణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం రామ్ చరణ్ కి మరింత మార్కెట్ అయితే క్రియేట్ అవుతుందనే చెప్పాలి…

ఇక ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందటమే కాకుండా పాన్ ఇండియాలో ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయడానికి తను అహర్నిశలు కష్టపడుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper