https://oktelugu.com/

Devara: దేవర కి ఆ విషయం లో మాత్రం నెగిటివ్ టాక్ రాబోతుందా..?

ప్రస్తుతం తనదైన రీతిలో గుర్తింపును పొందుతున్న హీరోల్లో ఎన్టీయార్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 26, 2024 / 02:13 PM IST

    Devara

    Follow us on

    Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. ఈ నెల 27వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే విషయం పక్కన పెడితే ఈ సినిమాకి ఒక విషయంలో మాత్రం నెగిటివిటీ అనేది ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలైతే ఉన్నాయంటూ ఇప్పటికే సినిమా మేకర్స్ ఈ సినిమా మీద కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను కనక మనం చూసుకున్నట్లైతే ట్రైలర్ లో గ్రాఫిక్స్ అనేది చాలా పూర్ గా కనిపించింది. అందువల్లే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా వరకు నెగెటివిటి అయితే పెరిగిపోతుంది. నిజానికి ప్రభాస్ చేసిన ‘ఆది పురుషు’ సినిమాలో గ్రాఫిక్స్ చండాలంగా ఉంటుంది.

    దానివల్ల ఆ సినిమా చూసే ప్రేక్షకుడిలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు దేవర సినిమా విషయంలో కూడా అదే మైనస్ అవ్వబోతుంది అంటూ చాలామంది ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ట్రైలర్ లోనే చాలా చోట్ల అది గ్రాఫిక్స్ అని ఈజీగా తెలిసిపోతున్న నేపథ్యంలో ఇక సినిమా చూస్తే గ్రాఫిక్స్ మరి దారుణంగా ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

    మరి దేవర సినిమా కథ, కథనం ఎలా ఉన్నా కూడా టెక్నికల్ గా మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా నిరాశ పరుస్తుంది అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పేలవమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమా అలా ముందుకు సాగబోతుంది అంటూ ఇంకొంతమంది ఈ సినిమా భవితవ్యాన్ని చెబుతున్నారు. ఇక ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ కి ఈ సినిమాతో సక్సెస్ పడితే మాత్రం వరుసగా ఏడోవ సక్సెస్ ను కొట్టిన స్టార్ హీరోగా గుర్తింపు పొందుతాడు. లేకపోతే మాత్రం పాన్ ఇండియా లో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్నా స్టార్ హీరోగా మిగిలిపోతాడు…