Allu Arjun and Chiranjeevi : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళను వాళ్ళు పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు…ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం పుష్ప 2 తో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు…
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియాలోనే టాప్ వన్ సినిమా గా నిలిచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక తొందర్లోనే ‘బాహుబలి 2’ రికార్డును కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ల్యాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని వసూలు చేస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి హైప్ రావడమే కాకుండా ఒకటికి రెండుసార్లు ఈ సినిమాను చూసే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీగా పబ్లిసిటీ చేసి సినిమా మీద బజ్ అయితే క్రియేట్ చేశారు. ఇక అందువల్లే వాళ్లు అనుకున్న కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది…ఇక ఇప్పటికే అల్లు అర్జున్ క్రేజ్ అయితే తారా స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కేసులో గత వారం రోజుల క్రిందట అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం కూడా మనకు అయితే తెలిసిందే. ఇక ఎట్టకేలకు హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది…అయితే తను ఈ కేసులో ఇరుక్కున్నాడని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య సినిమా ప్రొడ్యూసర్ అనే నిరంజన్ రెడ్డితో కాంటాక్ట్ అయి ఎలాగైనా సరే అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించాలని ఫోర్స్ చేయడంతో నిరంజన్ రెడ్డి హైకోర్టు ద్వారా బెయిల్ అయితే ఇప్పించాడు.
అందువల్లే అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చిన రోజు డైరెక్ట్ గా చిరంజీవి ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మొత్తం అల్లు అర్జున్ మీద తీసే విధంగా చిరంజీవి తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి…
ఇక మొన్నటిదాకా చిరంజీవిని పట్టించుకోని అల్లు అర్జున్ చిన్న కష్టం రాగానే చిరంజీవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాని ద్వారా చిరంజీవి అతనికి సాయం చేయడమే కాకుండా జనం దృష్టిలో మరోసారి బ్యాడ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకు అంటే ఒక మహిళ ప్రాణం తీయడానికి కారణమైన వ్యక్తికి చిరంజీవి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనే ధోరణిలో కొంతమంది చిరంజీవి మీద నెగిటివ్ ప్రచారం చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది ఈ పాయింట్ ను లేవనెత్తుతూ చిరంజీవి మీద విమర్శలైతే చేస్తున్నారు…