Chiranjeevi – Bimbisara 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన ఒకే ఒక్కడు చిరంజీవి. ఆయన కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అందుకే ఏదైనా విషయాన్నీ గొప్పగా చెప్పాలంటే దానికి మెగాస్టార్ ను ఎగ్జాంపుల్ గా వాడుతూ ఆయన గురించి చెబుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఇప్పటికీ కూడా ఆయన భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ ఇప్పటికి కూడా తను సోలా హీరోగా ఇండస్ట్రీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర ‘అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దర్శకుడు అయిన వశిష్ఠ ను దగ్గరగా పెట్టుకొని చిరంజీవి కూడా ఈ సినిమాలో ఉన్న ప్రతి సీను, ప్రతి షాట్ ని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారట.
ఎందుకంటే చిరంజీవి గత చిత్రమైన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యం తో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే వశిష్ట బింబిసారా 2 సినిమాకు సంబంధించిన పూర్తి కథను రెడీ చేసాడట. ఇక కళ్యాణ్ రామ్ తో ఈ సినిమాను తెరకెక్కిదాం అనుకున్న టైమ్ లో చిరంజీవి నుంచి విశ్వంభర ఆఫర్ రావడంతో వశిష్ట ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాడు. అయితే ఈ సినిమా తర్వాత అయిన బింబిసార సినిమా చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
అయితే ఈ సినిమా తెరకెక్కితే కళ్యాణ్ రామ్ కూడా స్టార్ హీరోగా మరోసారి తనని తాను గొప్పగా ప్రజెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాకి వశిష్ఠ కథ, మాటలు అందిస్తాడు.కానీ డైరెక్షన్ మాత్రం వేరే వాళ్ళు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో…