https://oktelugu.com/

Priyanka Jain: బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ని అరెస్ట్ చేయబోతున్నారా..? దేవాలయంలో అలాంటి పనులు చేసిందా!

'బిగ్ బాస్ 7' షో పూర్తి అయ్యాక, ఈమెకు వరుసగా చేతినిండా సీరియల్స్, సినిమాలతో బాగా బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈమెకు యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది. అందులో తన ప్రియుడు శివ కుమార్ తో కలిసి ఎన్నో ప్రాంక్ వీడియోలు చేస్తూ వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటుంది ప్రియాంక.

Written By:
  • Vicky
  • , Updated On : November 27, 2024 / 05:26 PM IST

    Priyanka Jain

    Follow us on

    Priyanka Jain: ‘బిగ్ బాస్’ సీజన్ 7 లో టాప్ 5 లోకి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతూ, ఎంతో అద్భుతంగా ఆడి ఆమె అంత దూరం వచ్చింది. బిగ్ బాస్ షో కి ముందు ఆమె పలు కన్నడ సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే టాప్ రేటెడ్ డైలీ సీరియల్స్ ‘కోయిలమ్మ’, ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ‘బిగ్ బాస్ 7’ షో పూర్తి అయ్యాక, ఈమెకు వరుసగా చేతినిండా సీరియల్స్, సినిమాలతో బాగా బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈమెకు యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది. అందులో తన ప్రియుడు శివ కుమార్ తో కలిసి ఎన్నో ప్రాంక్ వీడియోలు చేస్తూ వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటుంది ప్రియాంక.

    ఇదే పనిగా పెట్టుకున్న ప్రియాంక, యూట్యూబ్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తుంది. అయితే హద్దులు మీరిన ప్రాంక్ వీడియోలు చేయడం వల్ల ఈమె ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. అది కూడా పవిత్రమైన దేవాలయం విషయంలో . పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్లారు. అక్కడ వీళ్ళిద్దరూ అలిప్పిరి కాలినడకన వెళ్తూ, చిరుత పులి సంచరించే ఏడవ మైలు వద్ద ప్రాంక్ వీడియో చేసారు. చిరుత పులి వచ్చిందని ఒక ఫేక్ ఆడియో ని వీడియో కి జత చేసి, భయపడి పారిపోయినట్టు ఈ ప్రాంక్ వీడియో చేసింది. ఈ వీడియో కి యూట్యూబ్ లో భారీ వ్యూస్ వచ్చాయి. నెటిజెన్స్ వీళ్లిద్దరి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం వద్ద ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే తప్పు అంటుంటే ఇలాంటి పనికిమాలిన ప్రాంక్ వీడియోలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.

    ఈ వీడియో నేరుగా టీటీడీ బోర్డు మెంబెర్స్ కి చేరింది. ఆ బోర్డులో ఒక మెంబెర్ గా కొనసాగుతున్న బీజేపీ పార్టీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఈ వీడియో చేసిన ప్రియాంక జైన్ దంపతులపై ఫైర్ అయ్యాడు. పవిత్రమైన ఇలాంటి దేవాలయాలలో ఇలాంటి చిల్లర ప్రాంక్ వీడియోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించాడు. గతంలో తమిళనాడు కి చెందిన ఒక యూట్యూబర్ కూడా ఇలాగే చేసి కేసుల కారణంగా జైలు పాలయ్యాడు. ఇప్పుడు ప్రియాంక జైన్, శివకుమార్ లు కూడా కేసుల్లో చిక్కుకొని జైలుపాలు కాబోతున్నారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక కేవలం ఈ ఒక్క వీడియో నే కాదు, ఇది వరకు హద్దులు దాటి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసింది. చివరికి ఈమె తల్లిదండ్రులను కూడా ఇందులోకి దింపి అనేక ప్రాంక్ వీడియోస్ చేయించింది. వీటిని చూసిన నెటిజెన్స్ చాలా చిరాకు పడ్డారు, ఇలాంటోళ్ళపై కఠినచర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇంకా రెచ్చిపోతారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు.