https://oktelugu.com/

Balakrishna: తేజ చెప్పినట్టు గా చేస్తే ఎన్టీయార్ బయోపిక్ హిట్ అయ్యేదా..? ఆ సినిమా ప్లాప్ కి కారణం బాలయ్యేనా..?

ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పనికి పుచ్చుకొని నందమూరి ఫ్యామిలీ ఘన కీర్తి ని ఒంటి చేత్తో నిలబెట్టిన ఒకే ఒక హీరో బాలయ్య. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో ఒక పెను సంచలనంగా నిలిచేది.

Written By:
  • Gopi
  • , Updated On : February 6, 2024 / 10:29 AM IST
    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఏకైక హీరో బాలయ్య బాబు… ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్ లు అయితే మాస్ ప్రేక్షకులచేత విజిల్స్ వేయిస్తాయి.

    ఇక ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పనికి పుచ్చుకొని నందమూరి ఫ్యామిలీ ఘన కీర్తి ని ఒంటి చేత్తో నిలబెట్టిన ఒకే ఒక హీరో బాలయ్య. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో ఒక పెను సంచలనంగా నిలిచేది. చాలా సినిమాలతో చిరంజీవికి పోటీ ఇచ్చాడు. ఆ పోటి లో కొన్నిసార్లు బాలయ్య పై చేయి సాధిస్తే, మరికొన్ని సార్లు చిరంజీవి తన సినిమాలతో పై చేయి సాధించేవాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య వాళ్ళ నాన్న గారు అయిన ఎన్టీఆర్ గారి బయోపిక్ ని తీయడానికి దర్శకుడుగా ముందు తేజ ను తీసుకున్నారు.

    అప్పటికే తేజ నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో సక్సెస్ సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ స్టేజ్ లో వచ్చిన కొన్ని క్లాషేష్ వల్ల తేజ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక దాంతో అప్పటికే బాలయ్య బాబుతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తీసిన క్రిష్ ని ఈ సినిమాకి డైరెక్టర్ గా బాలయ్య బాబు తీసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రిలీజ్ అయినప్పటికీ అవి ఏవి కూడా పెద్దగా సక్సెస్ ని సాధించలేదు. దానికి కారణం ఏంటి అంటే అందులో ఎన్టీఆర్ కి సంబంధించిన చాలా విషయాలను సరిగ్గా చూపించలేదు.

    అందువల్లే ఆ సినిమా అనేది ఆర్టిఫిషియల్ గా ఉంది కానీ, ఎన్టీయార్ బయోపిక్ స్టోరీ లా అయితే లేదు అనే ఉద్దేశ్యం తోనే ప్రేక్షకులు దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తేజ కూడా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ఈ సినిమా స్టోరీ ఆర్టిఫిషయల్ గా ఉంది. రియాల్టీ గా లేదు మనం అలా చేద్దాం అని కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు అవి బాలయ్యకి నచ్చకి తేజ కి బాలయ్య కి మధ్య కొన్ని గొడవలు వచ్చి ఆ సినిమా నుంచి తను తప్పుకోవాల్సి వచ్చినట్టు గా అప్పట్లో మీడియాలో చాలా కథనాలు అయితే వచ్చాయి. ఒకవేళ తేజ చెప్పినట్టు గా స్టోరీ చేసి తనే ఈ సినిమా కి డైరెక్టర్ గా వ్యవహరించి ఉంటే మాత్రం ఈ సినిమా సక్సెస్ అయి ఉండేదని భావించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు…