Evadaithe Nakenti: డైరెక్టర్ పేరు మార్చి ఆ హీరో భార్య పేరు పెట్టారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?

రాత్రికి రాత్రి దర్శకుడి పేరు మార్చిన ఆ సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయినా డైరెక్టర్ పేరు తీసేసి హీరో భార్య పేరు పెట్టారంటే ఆ సినిమా వెనుక ఎంత కథ నడించిందో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Written By: Swathi Chilukuri, Updated On : February 6, 2024 10:28 am

Evadaithe Nakenti

Follow us on

Evadaithe Nakenti: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాల షూటింగ్ జరుగుతున్న మధ్యలో హీరోయిన్ లు ఎంట్రీ ఇవ్వడం. లేదా హీరోను మార్చడం, హీరోయిన్ ను మార్చేయడం, కథలో సడన్ గా మార్పులు చేయడం, లేదంటే సినిమాను ఆపేయడం ఇలా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తుంటారు దర్శకనిర్మాతలు. కానీ కొన్ని సార్లు హీరోలు కూడా దర్శకులను మారుస్తుంటారు. కానీ ఒక సినిమాకు మాత్రం ఏకంగా దర్శకుని పేరును వేయకుండా సినిమాను విడుదల చేశారు. అంతేకాదు ఆ సినిమా ప్లేస్ లో హీరో భార్య పేరు వేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా?

రాత్రికి రాత్రి దర్శకుడి పేరు మార్చిన ఆ సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయినా డైరెక్టర్ పేరు తీసేసి హీరో భార్య పేరు పెట్టారంటే ఆ సినిమా వెనుక ఎంత కథ నడించిందో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఆ సినిమా ఏంటో కాదు.. ఎవడైతే నాకేంటి. రాజశేఖర్ నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ పేరు మార్చి ఆయన భార్య జీవిత పేరును పెట్టడం విశేషం. అయితే ఈ హీరో సినిమా విడుదల అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు వస్తాయనే టాక్ ఉంది. ఇలా చాలా సందర్భాల్లో జరగడం విశేషం.

చాలా సందర్భాల్లో అనేక పరాజయాల మధ్య తక్కిన మంచి విజయం ఎవడైతే నాకేంటి. ఇది 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మొదట అనుకున్న డైరెక్టర్ సింహరాశి సినిమాకు దర్శకత్వం వహించిన వి. సముద్ర. కానీ ఈయన పేరు స్థానంలో జీవిత రాజశేఖర్ పేరు వచ్చి చేరింది. ఇక ఇందులో రాజశేఖర్ పాత్రకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమా రాజశేఖర్ కు మంచి సక్సెస్ ను అందించింది. అంతేకాదు మరిన్ని సినిమాల్లో నటించేందుకు అవకాశం గా మారింది.

అయితే రాజశేఖర్ కి ఎప్పుడైనా సాయికుమార్ వాయిస్ చాలా బాగా సూట్ అవుతుంది. అంతే కాదు ఈయన వాయిస్ కచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్ రాజశేఖర్ వాయిస్. అలాగే రఘువరన్ కూడా అద్భుతమైన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ముందు మూడేళ్ల పాటు పరాజయాలను చవిచూసిన రాజశేఖర్ ఈ సినిమా తర్వాత కొంత రిలీఫ్ అయ్యారు. కానీ మళ్లీ పరాజయాల బాటనే పట్టారు. కానీ మొత్తం మీద ఈ సినిమాలో డైరెక్టర్ పేరు ప్లేస్ లో ఆయన భార్య పేరు చేర్చడం అప్పట్లో సంచలనంగా మారింది.