https://oktelugu.com/

Business: ఊర్లో ఉంటూనే ఈ బిజినెస్ చేయొచ్చు.. కూర్చొని లక్షలు సంపాదించొచ్చు..

Business: నిజామాబాద్ జిల్లాకు అబ్దుల్ రాహుప్ అనే యువకుడు వ్యాపార రంగంలో రాణించాలనున్నాడు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో....

Written By:
  • Srinivas
  • , Updated On : July 6, 2024 / 03:55 PM IST

    Desi poultry farm business plan details

    Follow us on

    Business: జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని కొందరు టార్గెట్ పెట్టుకుంటారు. అయితే లక్ష్యాన్ని చేరేందుకు కొందరు ఉద్యోగ మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొందరు వ్యాపారాన్ని ఎంచుకుంటారు. అనతి కాలంలో డబ్బు సంపాదించాలంటే మాత్రం బిజినెస్ చాలా బెస్ట్ అని కొందరి అభిప్రాయం. వాతావరణం అనుకూలిస్తే తొందర్లోనే కోటీశ్వరులు కూడా కావొచ్చు. అయితే ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా ముందుగా దాని గురించి తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో మాంసం వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. ఇది నిత్యావసర పదార్థం అయినందున ఇందులో నష్టాలు తక్కువే అని కొందరు అంటుంటారు. వీటిలో చికెన్ వ్యాపారం మంచి లాభాలు అందిస్తుంటాటాయి. ఈ నేపథ్యంలో చికెన్ అందించే కోళ్ల పరిశ్రమతో ఓ యువకుడు లక్షలు సంపాదిస్తున్నాడు. అదెలా సాధ్యమైందో చూద్దాం..

    నిజామాబాద్ జిల్లాకు అబ్దుల్ రాహుప్ అనే యువకుడు వ్యాపార రంగంలో రాణించాలనున్నాడు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. సాధారణంగా బ్రాయిలర్ కోళ్ల ఫాం పెట్టాలంటే కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈ యువకుడు మాత్రం నాటుకోళ్ల పెంపకాన్ని ఏర్పాటు చేశాడు. ఈ గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఓ షెడ్డు వేసి అందులో కోళ్లను పెంచుతున్నాడు.

    ముందుగా అబ్దుల్ 40 గ్రాములు మాత్రమే ఉండే నాటుకోళ్ల పిల్లలను తీసుకొచ్చాడు. ఇవి ఒక్కోటి రూ.90 రూపాయల ఖర్చు అయింది. ఇవి తీసుకొచ్చిన 5 నెలల వరకు పెద్దవి అవుతాయి. ఐదు నెలల తరువాత 1 కేజీ నుంచి 2 కేజీల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో నాటుకోడి ధర రూ. 500లకు పైగానే ఉంది. అలా 500 కోడిపిల్లలను తీసుకొచ్చిన అబ్దుల్ కు అవి పెరిగి పెద్దయ్యాక భారీగా లాభాలు వచ్చాయి. ఇలా నిరంతరం కోడిపిల్లలను పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నాడు.

    చికెన్ లో నాటు కోడి కూర చాలా ఫేమస్. ఇవి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అబ్దుల్ వ్యవసాయం క్షేత్రం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ఇవి ప్రకృతిలో పెరుగుతాయి. దీంతో ఇవి తినడం వల్ల ఆరోగ్యం అని అంటున్నాడు. అలాగే కోళ్ల కు ప్రత్యేకంగా దాణాను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారం వల్ల అధిక లాభాలు పొందవచ్చు అని అంటున్నాడు. అయితే వర్షాకాలంలో మాత్రం వీటి కోసం ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు.