Devara Movie: దేవర సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుధ్ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నాడా..?

అనిరుధ్ మ్యూజిక్ లో వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రస్తుతం సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కమలహాసన్ హీరోగా వచ్చిన 'విక్రమ్' సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది.

Written By: Gopi, Updated On : May 1, 2024 2:44 pm

Anirudh going to set a new trend with Devara movie background music

Follow us on

Devara Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో కొరటాల శివ కూడా పాన్ ఇండియాలో మొదటిసారి తన లక్కును పరీక్షించుకోబోతున్నాడు. ఇక ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి సీను హైలైట్ గా నిలవడానికి తను పూర్తి ఎఫర్ట్ పెట్టి మరి ఈ సినిమా కోసం అనిరుధ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య అనిరుధ్ మ్యూజిక్ లో వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రస్తుతం సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కమలహాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది.

అలాగే రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన ‘జైలర్ ‘ సినిమా లో పెద్దగా మ్యాటర్ లేకపోయిన కూడా కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీదనే ఆ సినిమా అనేది అంత పెద్ద సక్సెస్ అయిందనే విషయం రజినీకాంత్ గారే ఒక ఈవెంట్ లో స్వయంగా ఒప్పుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక దానికి మించి ఇప్పుడు దేవర సినిమాలో తను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని హైలీ ఎమోషన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో అనిరుధ్ తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోబోతుందనే వార్తలైతే పుష్కలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాతో ఎన్టీయార్ భారీ సక్సెస్ అందుకుంటాడని చాలా మంచి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు…