NTR: సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూ. ఎన్టీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు. నలుగురికి కావాల్సింది ఇవ్వడం లో మజా ఉంటుంది అనుకుంటారు తారక్. అందుకే జనాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మాదిరి ఉంటారు. ఇక ప్రస్తుతం ముంబై వీధుల్లో ఈయన ప్లానింగ్ ఎలా ఉంటుంది. సెట్ అవుతుందా లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నార్త్, సౌత్ అభిమానులు చూపించే ప్రేమలో మునిగి తేలి పోతుంటారు ఎన్టీఆర్. ఈయన ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. వార్ 2 షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయ్యారు తారక్. ఇక హృతిక్ రోషన్, తారక్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీక ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంది. ఓ వైపు పగలు షూటింగ్ లు, మరోవైపు సాయంత్రం పార్టీలు అంటూ మరింత బిజీ అవుతున్నారు తారక్. ఇక ముంబైలో రణ్ బీర్ కపూర్, కరణ్ జోహార్, ఆలియా వంటి సెలబ్రెటీలతో కలిసి తారక్ వెళ్లిన పార్టీ వీడియో వైరల్ గా మారింది.
రోమ్ లో ఉంటే రోమన్ లా ఉండాలంటారు. అదే ట్రెండ్ అలవాటు చేసుకున్నట్టు ఉన్నారు తారక్. టాలీవుడ్ లో పార్టీ కల్చర్ పెద్దగా లేకపోయినా, ముంబై వీధుల్లో జరిగే విషయాల గురించి సెలబ్రెటీల పార్టీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తారక్ కు కరణ్ జోహార్ లాంటి వారి సపోర్ట్ ఉంది కూడా. దీంతో ఈ వాతావరణం త్వరగానే అలవాటు పడుతుంది అని అంటారు అభిమానులు. అక్కడ ఉన్న వారితో మింగిల్ అయితే ఫ్యూచర్ లో అక్కడ సినిమా ఈవెంట్లకు, ప్రీమియర్లకీ సెలబ్రెటీల సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉందట.
ఆర్ఆర్ఆర్ సమయంలో నార్త్ కల్చర్ కి అక్కడ పాపరాజీల స్టైల్ కు బాగా అలవాటు పడ్డారు రామ్ చరణ్, తారక్. ఇప్పుడు వీరు చూస్తుంది, నేర్చుకునేది కూడా బోనసే అంటున్నారు అభిమానులు. ఇక వార్ 2 షెడ్యూల్స్ కంప్లీటై దేవర ప్రమోషన్లు చేసే సమయానికి తారక్ పక్కా ముంబైవాలా మాదిరి మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటారు కొందరు.