https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కుమారుడు అయాన్ త్వరలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంచి.. ప్రస్తుతం మాత్రం ఫుల్ వైరల్ అయ్యేలా చేస్తున్నారట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 12, 2024 / 02:34 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అల్లు అర్జున్. ఈయన స్టార్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ గా అవతారమెత్తారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకొని పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు బన్నీ. ఇక ఈయన కూడా తన తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా తండ్రుల వారసత్వాలను కంటిన్యూ చేసిన వారెందరో ఉన్నారు. మరి బన్నీ కూడా తన కుమారుడిని ఇండస్ట్రీ లోకి తీసుకురావాలనుకుంటున్నాడా? అంటే అవును అనిపిస్తుందట కొందరికి.. ఎందుకంటే..

    సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంచి.. ప్రస్తుతం మాత్రం ఫుల్ వైరల్ అయ్యేలా చేస్తున్నారట. కేవలం భార్య స్నేహ రెడ్డి, కుమార్తె అర్హలను మాత్రమే హైలెట్ చేసేవాడు. కానీ ప్రస్తుతం దంపతులిద్దరు కుమారుడిని కూడా హైలెట్ చేస్తున్నారు. తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అయాన్ ప్రస్తుతం వైరల్ గా మారతున్నారు.

    గత కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో అయాన్ మోడల్ అంటూ చేసిన కామెంట్లు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక షారుఖ్ ఖాన్ పాటను కూడా హమ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు స్నేహ రెడ్డి. వీరి పెళ్లి రోజు సందర్భంగా ఆయన కేక్ తింటూ ఉన్న ఫోటో కూడా వైరల్ గా మారింది. రీసెంట్ గా కూడా స్నేహ రెడ్డి అయాన్ కు సంబంధించిన మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అయాన్ వర్క్ అవుట్స్ చేస్తూ జిమ్ ట్రైనర్ తో బాక్సింగ్ చేస్తున్నాడు. అంతేకాదు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేశాడు.

    ఇప్పటి నుంచే అందరి దృష్టి తనపై పడేలా అల్లు అర్జున్ దంపతులు ప్లాన్ చేస్తున్నారంటూ టాక్. త్వరలోనే ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అందుకోసం అన్నింటిలో శిక్షణ ఇప్పిస్తూ.. ప్రేక్షకులకు దగ్గర చేసే పనిలో పడ్డారట. ఇవన్నీ చూస్తున్న అభిమానులు అయాన్ మోడల్ కాదు అప్ కమింగ్ హీరో అంటున్నారు. మరి ఈయన ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.