Heroes Remuneration: రెమ్యూనరేషన్ లో బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన మన స్టార్ హీరోలు…

ఇప్పటికే గత సంవత్సరం ఎండింగ్ లో సలార్ సినిమాతో ప్రభాస్ ప్రభంజనాన్ని సృష్టిస్తే సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది.

Written By: Gopi, Updated On : March 12, 2024 2:39 pm

Tollywood star heroes Remuneration

Follow us on

Heroes Remuneration: ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనేంతలా మన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మన హీరోలను చూసి భయపడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మన సినిమా ఏది వచ్చినా అక్కడ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగడం విశేషం…

ఇక ఇప్పటికే గత సంవత్సరం ఎండింగ్ లో సలార్ సినిమాతో ప్రభాస్ ప్రభంజనాన్ని సృష్టిస్తే సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇలాంటి క్రమంలో మన సినిమాల స్థాయి ఏంటో ప్రేక్షకుడికి అలాగే బాలీవుడ్ హీరోలకి కూడా అర్థమైంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఖాన్ త్రయం ఒకప్పుడు అందరిని డామినేట్ చేస్తూ బాలీవుడ్(Bollywood) లో భారీ రెమ్యూనరేషన్ ను తీసుకునేవారు. వాళ్ళు ఏం చెప్తే అది నడిచేది కానీ ఇప్పుడు వాళ్ళ మార్కెట్ కూడా భారీగా డౌన్ అయిపోయింది.

మన సినిమాల ముందు, మన హీరోల ముందు వాళ్ళు తేలిపోతున్నారు. కాబట్టి మన స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలు వాళ్ళని బీట్ చేస్తూ 100 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూన రేషన్ తీసుకుంటున్నారంటే మన తెలుగు సినిమా స్థాయి అనేది ఏ రేంజ్ లో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మన తెలుగు హీరోలే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఏ భాషలో ఉన్న హీరోలు అయిన కూడా మనవాళ్ళలా భారీ సినిమాలను చేయడం గాని, భారీ సక్సెస్ లను అందుకోవడం గానీ చేయడం లేదు.

కాబట్టి ప్రస్తుతానికి అయితే మన హీరోలు టాప్ హీరోలుగా ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ హీరోలందరికీ చెక్ పెట్టినట్టుగా అయింది. అందుకే వాళ్ళు మన తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టాలని చూస్తున్నారు…ఇక అందులో భాగంగానే ఇప్పటికే రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా చేసి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు…