Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు ఫెస్టివల్ సీజన్లను భారీగా క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగని క్యాష్ చేసుకోవడానికి చాలామంది హీరోలు పోటీ పడుతుంటారు. మరి ఇలాంటి క్రమంలోనే అన్ని సినిమాలకు సరైన థియేటర్లైతే దొరకవు. దానివల్ల కొన్ని సినిమాలకు భారీగా నష్టం వాటిలల్లే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు పెద్ద ఎత్తున థియేటర్లు దొరికినప్పటికి చిన్న సినిమా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారవుతుందనే చెప్పాలి. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు. ఒకవేళ దొరికిన సిటీ అవతల ఉన్న థియేటర్ లలో గాని లేదా ఓల్డ్ థియేటర్లను వాళ్లకు ఇస్తారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి. రామ్ చరణ్ ఇప్పటికే తన డేట్ ని ఖరారు చేసినప్పటికీ బాలయ్య బాబు కూడా బరిలోకి దిగనున్నాడు. ఇక మరికొన్ని సినిమాలు కూడా ఈ సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొన్నటిదాకా ‘తండెల్ ‘ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పించినప్పటికి ఇప్పుడు సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కూడా సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను దింపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే డిసెంబర్ లో పుష్ప హవా కొనసాగిపోతుంది. ఇక సంక్రాంతి సీజన్ అయితేనే తండేల్ కు భారీగా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో తను ఈ ప్రణాళికను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇది తెలుసుకున్న చాలా మంది మెగా అభిమానులు సైతం అల్లు అరవింద్ రామ్ చరణ్ కి పోటీగా కావాలనే తన తండెల్ సినిమాను తీసుకొస్తున్నారని దీనివల్ల రామ్ చరణ్ కి జరిగే నష్టం ఏమీ లేదు లేదని తండెల్ సినిమాకే భారీ నష్టం జరగబోతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తండెల్ సినిమా సంక్రాంతి బరి లో నిలుస్తుందా?
లేదా అనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయనప్పటికి అల్లు అరవింద్ ఆ రకంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కనక సంక్రాంతి బరిలో నిలిస్తే ఏ సినిమాకి భారీగా నష్టం వాటిల్లుతుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి మరి ఈ సినిమా పోటీకి వస్తే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది…