Star Heroes: మన స్టార్ హీరోలు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నప్పటికి కథల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకబడే ఉంటున్నారు. ఎప్పుడు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలనే చేస్తున్నారు. అంతే తప్ప డిఫరెంట్ కథలను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘రంగస్థలం’ సినిమా తో రామ్ చరణ్ కొద్ది వరకు డిఫరెంట్ అటెంప్ట్ లని ట్రై చేశాడు. తనను తాను తగ్గించుకొని ఒక వెనకబడిన కులానికి సంభందించిన వ్యక్తి క్యారెక్టర్ లో నటించాడు. ఇక అప్పటినుంచి చాలావరకు అందరు అలాంటి కథలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. మళ్లీ ఆ సినిమాలన్నీ రొటీన్ ఫార్మాట్ లోనే సాగుతున్నాయి. మరి ఇప్పుడు మన స్టార్ హీరోలు మరొక ట్రెండ్ సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కథల విషయంలో చాలావరకు కేర్ ఫుల్ గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సినిమా సక్సెస్ సాధించాలన్నా ఫెయిల్యూర్ గా మిగలాలన్న కథ అనేది చాలా కీలకపాత్ర వహిస్తుంది. కాబట్టి ఆ కథకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడంలో గాని ఆ మొత్తం సెటప్ చేయడంలో గాని మన హీరోలు ఓకే అంటే దర్శకులు భారీ భారీ కథలను రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇమేజ్ చట్రంలో ఇరుక్కొని ఇప్పుడు మాస్ జాతర సినిమాలే చేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మంచి విజయాలు దక్కుతాయి.అలాగే కలెక్షన్స్ లోనే కాకుండా కంటెంట్ పరంగా కూడా మనం బాలీవుడ్ ని బీట్ చేయవచ్చు అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ ఇండస్ట్రీ గా కొనసాగుతున్నప్పటికి మలయాళం సినిమా ఇండస్ట్రీలో వచ్చేటువంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రావడం లేదనే అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభావితం చేయాలంటే అన్ని ఇండస్ట్రీ ల్లో వచ్చే సినిమాల కంటే మన ఇండస్ట్రీ లో వచ్చే సినిమాలే తోపు సినిమాలని నిరూపించుకోవాలి.
కాబట్టి అన్ని జానర్స్ లో సినిమాలను చేస్తూ అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగినప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది భారీగా ఎలివేట్ అవుతుంది. లేకపోతే మాత్రం మిగతా ఇండస్ట్రీలు మన ఇండస్ట్రీ ని డామినేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…