Koratala Siva- NTR: టాలీవుడ్ లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. అదేమిటంటే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ పై రివేంజ్ తీర్చుకుంటున్నాడట. కావాలనే ఆయనతో సినిమాను ఆలస్యం చేస్తున్నాడట. సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో… సరికొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. దర్శకుడు కొరటాల ఎన్టీఆర్ 30 ప్రకటించి ఏడాది దాటిపోయింది. ఆచార్య మూవీ నుండి పూర్తిగా బయటపడ్డాక ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కిస్తారని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. ఆచార్య విడుదలై 8 నెలలు కావస్తోంది. ఇంత వరకూ మూవీ షూట్ స్టార్ట్ కాలేదు.

ఇక ఈ ప్రాజెక్ట్ పై అనేక పుకార్లు వినిపించాయి. కొరటాల స్క్రిప్ట్ నచ్చక ఎన్టీఆర్ మార్పులు సూచించారట. ఆ మేరకు కొంత ఆలస్యం అయ్యిందన్నారు. అలాగే హీరోయిన్ సెట్ కాలేదని, అది కూడా ఒక కారణమనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందే రామ్ చరణ్ శంకర్ మూవీని పట్టాలెక్కించి చకచకా పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం అసలు మొదలుపెట్టలేదు.
కొరటాల కారణంగానే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుట్ర కోణం తెరపైకి తెస్తున్నారు. ఎన్టీఆర్ పై అక్కసుతో ఉన్న కొరటాల కావాలనే ప్రాజెక్ట్ లేట్ చేస్తున్నారని. గతంలో ఏర్పడిన విభేదాలు నేపథ్యంలో రివేంజ్ తీర్చుకుంటున్నాడని. కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. అయినప్పటికీ ఎన్టీఆర్-కొరటాల మధ్య కోల్డ్ వార్ నడిచిందని. అవి మనసులో పెట్టుకొని కొరటాల ఇప్పుడు కసి తీర్చుకుంటున్నాడని, ఆరోపణలు చేస్తున్నారు.

స్క్రిప్ట్ కాలేదని, హీరోయిన్ దొరకలేదని సాకులు చూపుతూ ప్రాజెక్ట్ డిలే చేస్తున్నారట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక వర్గం ఈ తరహా పుకార్లకు తెరలేపారు. అయితే అవన్నీ ట్రాష్ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. అలా చేస్తే నష్టపోయేది కొరటాలే కదా అంటున్నారు. కారణం… ఎన్టీఆర్ కి మహా అయితే ఒక ఏడాది వేస్ట్ అవుతుంది. ఆయన ఊ అంటే సినిమా చేయడానికి దర్శకులు క్యూ కడతారు. కానీ ఎన్టీఆర్ ని కొరటాల మోసం చేశాడనే విషయం తెలిస్తే ఇతర హీరోలు ఆయనకు ఛాన్సులు ఇవ్వరు. పూర్తిగా ఆయన కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఈ మాత్రం కొరటాలకు తెలియదా అంటూ కొట్టిపారేస్తున్నారు.