Homeజాతీయ వార్తలుKCR BRS: కేసీఆర్ కు ఎంత కష్టమొచ్చే.. గిట్లయితే ఎట్ల సారూ!

KCR BRS: కేసీఆర్ కు ఎంత కష్టమొచ్చే.. గిట్లయితే ఎట్ల సారూ!

KCR BRS: హస్తిన స్పందించలేదు.. జాతీయ కార్యాలయం ప్రారంభించినా మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చ లేదు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామి మినహా ఎవరు రాలేదు. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా హాజరు కాలేదు. రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ ముఖం కూడా చూపించలేదు.. మొత్తానికి ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావిడి లాగా… హైదరాబాదు నుంచి వచ్చిన వాళ్లు తప్ప మిగతా వాళ్ళ జాడ కనిపించలేదు. మొత్తంగా చెప్పాలంటే కెసిఆర్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన పెద్దగా ప్రభావం చూపలేదు.. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదిగేందుకు పేరు మార్చుకొని, అట్టహాసంగా భారత రాష్ట్ర సమితి ఏర్పాటుచేసినా ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది? అసలు దీని వెనక కారణమేమిటి? చంద్రశేఖర రావు అర్ధాంతరంగా హైదరాబాద్ ఎందుకు తిరిగి వచ్చారు?

KCR BRS
KCR BRS

చర్చ జరగలేదు

రెండు రోజుల క్రితం చండీయాగంతో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించినప్పటికీ… దేశ రాజధానిలో రాజకీయ వర్గాల మధ్య గానీ, మీడియాలో గానీ, విశ్లేషకుల మధ్య గానీ దీనిపై ఎటువంటి చర్చా జరగడం లేదు.. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఢిల్లీ వచ్చిన కేసీఆర్… రోజులపాటు దేశ రాజధాని లోనే బస చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించారేమో… కార్యకర్తల కోసం సర్వదర్శన ఏర్పాటు చేశారు. శనివారం కూడా ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. అకస్మాత్తుగా కెసిఆర్ శుక్రవారం రాత్రే హైదరాబాద్ తిరిగి వచ్చారు. భారత రాష్ట్ర సమితి గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో శుక్రవారమే హైదరాబాద్ కు వెళ్లిపోయారని ఢిల్లీలోని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.. అయితే పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసు రావడంతో హడావిడిగా ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్లారని మరో నేత వ్యాఖ్యానించారు.. కాగా కేసీఆర్ వెళ్లే ముందు తుగ్లక్ రోడ్డులోని తన నివాసం నుంచి భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయానికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. అయితే కార్యాలయం వద్ద శుక్రవారం కూడా హైదరాబాదు నుంచి వచ్చిన పార్టీ నేతలే హడావిడి చేశారు.

ఎందుకు పట్టించుకోలేదు

పార్లమెంట్లో ప్రస్తుతం సమావేశం జరుగుతున్నాయి.. కాంగ్రెసేతర పార్టీల మధ్య కూడా భారత రాష్ట్ర సమితి గురించి చర్చ జరగలేదు.. శరత్ పవర్ తో పాటు వివిధ పార్టీల నేతలు ఢిల్లీలో ఉన్నప్పటికీ వారికి ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తానంతట తాను తమిళనాడు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు తిరిగినా జేడీయూ, బి జె డి, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏర్పాటును విస్మరించడం గమనార్హం.. అఖిలేష్ యాదవ్, కుమార స్వామికి కేసిఆర్ ఆర్థిక సహాయం చేసినందుకే వారు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

KCR BRS
KCR BRS

మేధావులు, ఎన్జీవోలు, శాస్త్రవేత్తలు కూడా ఎవరూ పెద్దగా రాలేదు. కేసీఆర్ ను తరచూ కలిసే ఎన్డి టీవీ మాజీ సీఈవో ప్రణయ్ రాయ్ కూడా కేసీఆర్ ని కలవలేదు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి అధినేత ఢిల్లీకి వచ్చి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తే ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ లో తమ పార్టీపైకి నేతల దృష్టి మళ్లించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ నుంచి 200 మంది దాకా కార్యకర్తలను రప్పించుకుని, నినాదాలను ఇప్పించుకుని, వారికి కెసిఆర్ తో సర్వదర్శనం ఏర్పాటు చేయించడం మినహా జాతీయస్థాయిలో భారత రాష్ట్ర సమితి గురించి ప్రచారం కల్పించేందుకు నేతలు ఎవరు పెద్దగా ప్రయత్నించకపోవడం గమనార్హం..ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ స్థాపించినప్పుడు జరిగిన హడావిడిలో ఇప్పుడు 0.1 శాతం కూడా లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక వచ్చేవారం కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇతర మేధావులతో భేటీ కార్యక్రమం ఉన్నందున ఆయన ఢిల్లీ వస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular