https://oktelugu.com/

టీజర్ తో తెగ నవ్వించిన ‘జాతి రత్నం’ !

టాలెంటెడ్ యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దాంతో మనోడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా యూత్‌లో న‌వీన్ కి క్రేజ్ అమాతం పెరిగిపోయింది. అదే క్రేజ్ తో అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుండి నవీన్ పోలిషెట్టి పాత్రను పరిచయం చేస్తూ టీజర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 01:01 PM IST
    Follow us on


    టాలెంటెడ్ యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దాంతో మనోడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా యూత్‌లో న‌వీన్ కి క్రేజ్ అమాతం పెరిగిపోయింది. అదే క్రేజ్ తో అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుండి నవీన్ పోలిషెట్టి పాత్రను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ ఆద్యంతం ఫన్ క్రియేట్ చేస్తూ సాగడంతో సినిమాలో మంచి కంటెంట్ ఉందనే ఫీల్ ను క్రియేట్ చేసింది.

    Also Read:  అభిజిత్ కి పెళ్లి చేస్తున్నామన్న తల్లి!

    పేరుకే జాతిరత్నం కానీ అతడు ఉండేది జైల్లో అంటూ చెప్పిన డైలాగ్.. ఇంతకీ ఈ జాతి రత్నం ఏం నేరం చేసి జైల్లో పడ్డాడో? అనే కోణంలో సాగిన ఈ టీజర్ ను బట్టి సినిమా మొత్తం ఫన్ బేస్ తో నడుస్తోందని అర్ధం అవుతుంది. పైగా నవీన్ కామిక్ టైమింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. ముఖ్యంగా నవీన్ డైలాగ్ తీరు బాడీ లాంగ్వేజ్ చాల బాగుంటాయి. అన్నట్టు ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండ- రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

    Also Read: వైరల్ అవుతోన్న నాగబాబుతో అభిజీత్ ముచ్చట్లు !

    అనుదీప్ కె వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. జాతి రత్నాలు త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం జాతిరత్నాలు సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశాడట నవీన్. కాగా వచ్చే వారంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందని.. ఫుల్ ఎంటర్ టైనర్ గా సూపర్ హిట్ గా నిలుస్తోందట. ఏమైనా జాతిరత్నాలు గాని హిట్ నవీన్ రేంజ్ మారిపోతుంది. హీరోగా అతనికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్