https://oktelugu.com/

అభిజిత్ కి పెళ్లి చేస్తున్నామన్న తల్లి!

గత వారం రోజులుగా ప్రతి ఒక్కరి నోట అభిజిత్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్న ఆయన హీరో అయిపోయారు. హౌస్ లో మొదటి వారం నుండి తన ప్రత్యేకత చాటుకున్న అభిజిత్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకొని విన్నర్ అయ్యారు. అందరూ టాస్క్ ల కోసం కష్టపడి చెమటోడ్చితే, అభిజిత్ మాత్రం తన బ్రెయిన్ ఉపయోగించి… కండ బలం కంటే బుద్ది బలం శక్తివంతమైనది అని నిరూపించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 12:55 PM IST
    Follow us on


    గత వారం రోజులుగా ప్రతి ఒక్కరి నోట అభిజిత్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్న ఆయన హీరో అయిపోయారు. హౌస్ లో మొదటి వారం నుండి తన ప్రత్యేకత చాటుకున్న అభిజిత్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకొని విన్నర్ అయ్యారు. అందరూ టాస్క్ ల కోసం కష్టపడి చెమటోడ్చితే, అభిజిత్ మాత్రం తన బ్రెయిన్ ఉపయోగించి… కండ బలం కంటే బుద్ది బలం శక్తివంతమైనది అని నిరూపించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ మరియు హారిక అఫైర్ హైలైట్ అయ్యింది. మొదట్లో మోనాల్ కి దగ్గర కావాలని చూసిన అభిజిత్ హారికకు చేరువయ్యారు. వీరు హౌస్ లో ఉండగా అభిజిత్ ఫ్యాన్స్ అభిక పేరుతో ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. అంతగా వీళ్ళ రిలేషన్ హైలైట్ అయ్యింది.

    Also Read: ప్రీ వెడ్డింగ్ పార్టీలో మునిగితేలుతున్న సునీత-రామ్ జంట!

    అయితే అనూహ్యంగా హౌస్ నుండి బయటికి వచ్చాక హారిక నా చెల్లి లాంటిది అని అభిజిత్ బాంబ్ పేల్చాడు. అభిజిత్ ఆన్సర్ అందరినీ షాక్ కి గురిచేయగా… వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. అభిజిత్ తల్లి లక్ష్మీ బిగ్ బాస్ షో సమయంలో బాగా పాప్యులర్ అయ్యారు. అభిజిత్ టైటిల్ ఫేవరేట్ అంటూ వరుస కథనాలు వస్తున్న సందర్భంలో ఆమె అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అయితే అభిజిత్, హారికల రిలేషన్ ని, ఆమె మంచి మిత్రులుగా వర్ణించారు. అభిజిత్ హరికను చెల్లి అన్న తరువాత ఆమె కూడా అతనికి వంత పాడుతూ, మాకు అమ్మాయిలు లేని లోటు తీర్చింది హారిక అన్నారు.”

    Also Read: క్రేజీ అంకుల్స్ ట్రైలర్: శ్రీముఖి గ్లామర్.. దారుణమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్

    హారిక సంగతి అటుంచితే అభిజిత్ పెళ్లిపై అభిజిత్ తల్లి లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది చివర్లో అభిజిత్ కి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. మరి అమ్మాయి ఎవరు అనగా… మ్యాచెస్ చూస్తున్నాం, మా అభిరుచికి తగిన మంచి అమ్మాయితో అభిజిత్ పెళ్లి జరుగుతుందని ఆమె స్పష్టత ఇచ్చారు. అంటే వచ్చే ఏడాది అభిజిత్ వివాహం గ్రాండ్ గా జరగనుందన్న మాట. ఇక టైటిల్ విన్నర్ గా పిచ్చ ఫాలోయింగ్ తెచ్చుకున్న అభిజిత్ కి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం అందుతుంది. వస్తున్న అవకాశాలలో మంచి ప్రాజెక్ట్స్ ఎంచుకొని కెరీర్ నిర్మించుకోవాలని అభిజిత్ ప్లాన్ చేస్తున్నాడట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్