ఇక దివ్య మొత్తానికి ప్రేమ్ ను తీసుకెళుతుంది. మరోవైపు శృతి ప్రేమ్ గురించి బాధపడటం చూసి తన స్నేహితురాలు శృతికి నచ్చజెప్తుంది. వెళ్లి ప్రేమ్ కు నిజం చెప్పేస్తా అనేసరికి శృతి ఒట్టు తో ఆపేస్తుంది. ప్రేమ్ ఆటపై శ్రద్ధ పెట్టకుండా ఆడటంతో అభి, దివ్యలు మంచిగా ఆడమని కోరుకుంటారు. ప్రేమ్ తన జీవితాన్ని ఆటలో చూపిస్తూ మాట్లాడగా అభి, అంకిత నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. అదే సమయానికి లాస్య, నందు రావడంతో వాళ్లని చూసి ప్రేమ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతుండగా నందు.. తనను ఆపి ప్రశ్నిస్తాడు.
మళ్లీ పెళ్లి గురించి కాసేపు మాటల యుద్ధం చేస్తాడు నందు. లాస్య మధ్యలో రావడంతో లాస్య పై అరుస్తాడు ప్రేమ్. తులసి వల్లే అంటూ ఇదంతా జరిగింది అంటూ నందు అరుస్తాడు. కాసేపు మాటల యుద్ధం జరుగగా అభి వచ్చి నాన్న మాట విను అంటూ నచ్చ చెబుతాడు. కానీ ప్రేమ్.. నువ్వు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎవరు అడ్డు పడలేదు.. నాకెందుకు అడ్డుపడుతున్నారు అని ఎమోషనల్ అవుతాడు. కానీ శృతి నిన్ను ప్రేమించడం లేదు కదా అందుకే ఒప్పుకోవడం లేదు అంటూ అని అనడంతో అక్కడే ఉన్న శృతి చూస్తూ ఉండిపోతాడు.
ఇక భాగ్యం లాస్య కి ఫోన్ చేసి మాట్లాడటంతో లాస్య తను ఒక ప్లాన్ చేసిన విషయాన్ని భాగ్యంతో చెబుతుంది. రేపు ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అంటూ భాగ్యంకు చెప్పేసరికి.. భాగ్యం బాగా ఆత్రుత గా ఫీల్ అవుతుంది. తులసికి అక్షర గార్నమెంట్ నుండి అమౌంట్ రాలేదు అంటూ ఫోన్ రావడంతో తులసి షాక్ అవుతుంది. వెంటనే పురుషోత్తంను పిలిచి ఆ ఏర్పాట్లు చేయమని చెబుతుంది. తరువాయి భాగంలో తులసిని పోలీసులు వచ్చి అరెస్టు చేయడంతో కథ మొత్తం ఇంకా ఆసక్తి గా అనిపించడంతో.. ఇదంతా లాస్యనే చేయించిందన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ తులసి జైలు కి వెళ్తే నందు ఫ్యామిలీ పరువు.. లాస్య వాళ్ళ పోవడం కాయం..