కానీ శృతి మాత్రం తనంటే ఇష్టం లేదని లోలోపల కుమిలిపోతూ బయటికి గట్టిగా చెప్పినట్లు నటిస్తుంది. ప్రేమ్ శృతి మాటలు విని బాగా ఎమోషనల్ అవుతాడు. గతాన్ని తలుచుకుని కుమిలిపోతాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన శృతి కూడా తన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది. తులసి కూడా వీరి మధ్య ప్రేమ గురించి తలుచుకుంటూ బాధపడుతుంది. శృతి వంట గదిలో ఉన్నప్పుడు రాములమ్మ శృతి బాధలు పంచుకుంటుంది. మరోవైపు నందు టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.
ఏం జరిగిందని పక్కనే ఉన్న లాస్య అడగటంతో.. ఓ పెద్ద కంపెనీకి తను డీల్ కుదుర్చుకున్నా ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని ఇప్పుడు అక్కడి నుంచి ఫోన్ వస్తుందని ఏం సమాధానం చెప్పాలి అని టెన్షన్ పడతాడు. అంతలోనే ఫోన్ రావడంతో నందుపై ఆ అధికారి కోపమవుతాడు. ఆలస్యం చేస్తే పెనాల్టీ కట్టాలని చెప్పేస్తాడు. ఇక నందు టెన్షన్ పడగా.. లాస్య ఆ విషయం గురించి పట్టించుకోకుండా ప్రేమ్ పెళ్లి గురించి ఆలోచిస్తే మన కంపెనీ లాభాల్లో ఉంటుంది అని సలహా ఇస్తుంది. కానీ ప్రేమ్ ఒప్పుకోవడం లేదని అనేసరికి లాస్య ఎలాగైనా ఒప్పించాలని గట్టిగా చెబుతోంది. ఇక మరోవైపు తులసికి తను చేసిన వర్క్ నుండి ప్రశంసలు వస్తాయి.
అంతేకాకుండా దాదాపు 12 లక్షల డబ్బులు సంపాదించడంతో.. ఈ శుభవార్తతో బాగా సంతోష పడుతుంది. ఇక ప్రేమ్ దగ్గరికెళ్లి డబ్బులు ట్రాన్స్ ఫర్ గురించి అడగగా ప్రేమ్ తనకి డబ్బులు ఎలా పంపించాలో ఫోన్ ద్వారా నేర్పిస్తాడు. తులసి తన మనసులో శృతితో దూరం కావడానికి ఇలా ఏదో ఒక విషయంలో మనసును మళ్ళించాలి అని అనుకుంటుంది. వర్కర్స్ కి సాలరీ కోసం ఓ చెక్ ఇచ్చి ప్రేమ్ ను పంపిస్తుంది. తరువాయి భాగం తులసి చేదు వార్త వింటుంది. ఆ చెక్ బౌన్స్ అయ్యింది అంటూ పోలీసులు తులసిని అరెస్టు చేస్తారు. అదంతా చూస్తే లాస్య చేసినట్లు అనిపిస్తుంది.