పెళ్లి మండపం దగ్గర అందరూ ఉండగా ఆర్య జిండేతో ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయమంటాడు. అనును మండపం పైకి తీసుకెళ్లి సుబ్బుతో పాటు అందరికీ గతం గురించి చెబుతాను అనేసరికి అక్కడికి వచ్చిన జలంధర్ మనుషులు, రఘుపతి షాక్ అవుతూ చూస్తారు. ఆర్య తనకు ఇదివరకే ప్రేమ పెళ్లి అయిందని, ఆమె పేరు రాజనందిని కానీ ఇప్పుడు లేదని ఈ లోకాన్ని విడిచి వెళ్లిందని చెప్పేసరికి అందరు షాక్ అవుతారు. మాన్సీ కూడా షాక్ అవుతుంది.
ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి అంటూ అందులో ఒకటి అను తల్లిదండ్రులకు తన కూతురు భవిష్యత్తు గురించి నమ్మకం ఉండాలి అని మరొకటి తన భార్య రాజనందిని చావును అడ్డుపెట్టుకొని తనను నిందించిన వాళ్లకు అని తెలిపాడు. ఇక గతంలో తనపై రాజనందిని విషయంలో నింద మోపినా శత్రువులు ప్రచురింపబడిన పేపర్ ను చూపించగా అందరూ ఆశ్చర్యపోతారు.ఇందులో నిజమెంతో అందరికీ తెలియడానికి ఆ న్యూస్ పేపర్ మేనేజర్ ను పిలిపించి అందరికీ తెలిసేలా చేస్తాడు.
ఆ అధికారి కూడా ఆర్య గురించి రాజనందిని గురించి చెప్పి ఇక పేపర్ లో రాజనందినిని ఆర్య చంపించాడు అనే నిందను వార్త లాగా.. ఆర్య అంటే పడని జలంధర్ ఇదంతా చేయించాడు అని మొదట తను ఒప్పుకోక పోయేసరికి తర్వాత తన కుటుంబాన్ని చంపేస్తాను అని అనడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది అని తెలిపాడు ఆ న్యూస్ పేపర్ అధికారి. ఆ సమయంలో ఆర్య వర్ధన్ కు ఈ విషయం చెప్పానని కానీ ఆర్య వర్ధన్ తనను ఏమీ అనలేదని ఆర్య గురించి గొప్పగా చెప్పాడు. ఆర్య గొప్పదనాన్ని తెలుసుకున్న అందరూ చప్పట్లతో పొగిడారు. ఇక ఆర్య సుబ్బుతో మాట్లాడుతూ ఇదంతా జరిగిన విషయమని నాకు గతంలో రాజనందిని ఎలానో ఇప్పుడు అను అలా అని ఇక మీరు ఈ విషయం గురించి ఏం నిర్ణయం చెబుతారో అంటూ సుబ్బుని ప్రశ్నిస్తాడు. దీనిని బట్టి ఆర్య,అనుల జీవితం సుబ్బు చేతిలోనే ఉందని తెలుస్తుంది.