https://oktelugu.com/

Intinti Gruhalakshmi Serial: చెక్కు బౌన్స్ చేయించిన లాస్య.. ప్రేమ గురించి ప్రేమ్ ను అడిగిన అక్షర!

Intinti Gruhalakshmi Serial : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ నేపథ్యం కథతో సాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక తులసికి అక్షర గార్నమెంట్ నుండి అమౌంట్ రాలేదు అని ఫోన్ రావడంతో పురుషోత్తం కు చెప్పి చెక్కు ద్వారా పంపించమని తెలుపుతుంది. ఇక పురుషోత్తం బయటికి వెళ్ళగా లాస్య ఫోన్ చేసి చెక్కు బౌన్స్ అయ్యేలా చూడమని చెబుతుంది. మరోవైపు ప్రేమ్ కాఫీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 17, 2021 / 12:03 PM IST
    Follow us on

    Intinti Gruhalakshmi Serial : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ నేపథ్యం కథతో సాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక తులసికి అక్షర గార్నమెంట్ నుండి అమౌంట్ రాలేదు అని ఫోన్ రావడంతో పురుషోత్తం కు చెప్పి చెక్కు ద్వారా పంపించమని తెలుపుతుంది. ఇక పురుషోత్తం బయటికి వెళ్ళగా లాస్య ఫోన్ చేసి చెక్కు బౌన్స్ అయ్యేలా చూడమని చెబుతుంది. మరోవైపు ప్రేమ్ కాఫీ షాప్ లో కూర్చుని శృతి అన్న మాటలను తలుచుకుంటూ బాధపడతాడు.

    అదే సమయానికి అక్కడ అక్షర తన స్నేహితురాలితో వచ్చి ప్రేమ్ ను చూసి మురిసిపోతుంది. ఇక ప్రేమ్ తో ఎలాగైనా మాట్లాడాలని.. యూట్యూబ్ వీడియో అనే వంకతో ప్రేమ్ దగ్గరికి వెళ్లి ప్రేమ గురించి కొన్ని విషయాలు చెప్పమని కోరుకుంటుంది. ప్రేమ్ చెప్పడానికి నిరాకరించగా ఆ తర్వాత అక్షర ఎలాగైనా తన నోటి నుంచి ప్రేమ గురించి చెప్పిస్తుంది. ఆ మాటలకు అక్షర ఫిదా అవుతూ మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడిగింది. వెంటనే శృతిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడి తన తల్లి ప్రేమ గురించి వివరించి అక్కడనుంచి వెళ్ళిపోతాడు.

    అక్షర ఇంటికి వెళ్లి ప్రేమ్ ను కలిసినందుకు ప్రేమ్ ను ఊహించుకుంటూ డాన్స్ చేస్తుంది. ఇక అదే సమయానికి తన తండ్రి వచ్చి తన సంతోషాన్ని పంచుకుంటాడు. ప్రేమ్ తో మీటింగ్ ఏర్పాటు చేయొచ్చు కదా అని అక్షర కోరడంతో వెంటనే జీకే నందు కి ఫోన్ చేసి ప్రేమ్, అక్షరల మీటింగ్ కోసం చెబుతాడు. ఇక నందు.. ప్రేమ్ ఇంకా టైం కావాలి అని అనడంతో.. జీకే.. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా అడిగేసరికి నందు ఓపెన్ అవుతూ.. ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి ప్రేమించడం లేదు అంటూ సమాధానమిస్తాడు.

    జీకే మాట్లాడుతూ తన కూతురు సంతోషం కోసం ఏమైనా చేస్తా, బాధపడితే ఎంతటి దానినైనా అంతం పట్టిస్తా అని అనేసరికి నందు భయపడతాడు. వెంటనే తులసిని పిలిచి ప్రేమ్ పెళ్లి గురించి గట్టిగా అరవడంతో తులసి కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది. అంతేకాకుండా శృతి ప్రేమ్ ప్రేమను కాదనడానికి కారణం ఏంటో.. తనకు ఎవరైనా అలా చేయమని చెప్పారా అంటూ గట్టిగా మాట్లాడుతుంది. ఎలాగైనా శృతి వెనకాల అసలు నిజం ఏమిటో తెలుసుకుంటాను అని గట్టిగా చెబుతుంది.