ఇక వసు సార్ కి ఫోన్ చేయాలని ఫోన్ చేయగా పక్కనే ఫోన్ సౌండ్ మోగడంతో చూసేసరికి రిషిని చూసి షాక్ అవుతుంది. శిరీష్ కూడా షాక్ అవగా.. వసు రిషి దగ్గరికి వెళ్లి మాట్లాడటంతో రిషి మాత్రం పొగరుగా సమాధానం ఇస్తాడు. రిషి గట్టిగా క్లాస్ తీసుకుంటాడు. శిరీష్ ను కూడా క్లాస్ తీసుకున్నట్లే అనిపించింది. ఇక ప్రాజెక్టు పని పూర్తి చేయమని చెప్పేసరికి రాత్రి నిద్రపోకుండా ప్రాజెక్టు పని పూర్తి చేస్తుంది వసు. జగతి నిద్ర పొమ్మన్న కూడా ప్రాజెక్టు పని అయ్యాకే పడుకుంటానని చెబుతుంది. ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యా రిషి కి మెసేజ్ పెడుతుంది.
రిషి చూసి రిప్లై ఇవ్వకపోవడంతో ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచనలో పడిపోయింది. అంతలోనే ఫోన్ చెయ్యి తగిలి ఫోన్ కలవడంతో టెన్షన్ పడుతుంది. రిషి ఫోన్ లేపేసరికి అనుకోకుండా ఫోన్ వచ్చింది అని చెప్పినా కూడా రిషి వెటకారంగా మాట్లాడుతాడు. రిషి మాట్లాడుతున్న సమయంలో ఫోన్ కట్ చేయగా ఏంటో మాట్లాడుతుండగానే కట్ చేస్తాడు అనేసరికి జగతి వచ్చి ఎవరు అని అడుగుతుంది. రిషి సార్ అని చెప్పడంతో అదుపులో ఉండు అంటూ జాగ్రత్త అని చెబుతుంది. వసు కూడా సరే అని బదులిస్తుంది.
ఉదయాన్నే మహేంద్ర పేపర్ చదువుతుండగా రిషి ఎంత పిలిచినా వినిపించుకోడు. గట్టిగా పిలిచేసరికి సారీ అని చెబుతాడు. రిషి మాట్లాడుతూ ఏదైనా అంటే రిషి కి కోపం ఎక్కువ అది ఇది అంటారని అంటాడు. ఇక మహేంద్ర నిన్న ఒక వ్యాసం చదివాను అంటూ కోపం ఎలా తగ్గించుకోవాలో అనే దాని గురించి అద్భుతంగా రాశారు అంటూ చెప్పగా రిషి కాస్త వెరైటీగా చూస్తాడు. ఇక తరువాయి భాగం లో వసు రిషి వాళ్ల ఇంటికి వెళ్లగా దేవయాని ఈ టైంకి ఎందుకు వచ్చిందో అని అంటుంది. ఇక నేరుగా లోపలికి వచ్చి రిషిని పిలిచే సరికి దేవయాని కోపంగా మాట్లాడుతుంది. ఇక జగతి, మహేంద్ర రిషి, వసుల గురించి మాట్లాడగా దూరం నుంచి కారులో నుండి చూస్తాడు రిషి.