https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ ను నెంబర్ వన్ హీరో అంటున్న కోలీవుడ్ మీడియా…మ్యాటరేంటంటే..?

రాజమౌళి పుణ్యమాని బాహుబలి సినిమా రావడం తో ఒక్కసారిగా తెలుగు సినిమా క్రేజ్ కూడా భారీ స్థాయి లో పెరిగింది. అలాగే బాలీవుడ్ లో సౌత్ సినిమాల ట్రెండ్ కూడా మొదలైంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 5, 2024 / 05:06 PM IST

    Prabhas number one hero

    Follow us on

    Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు హీరోల హవా కొనసాగుతుంది. బాలీవుడ్(Bollywood) హీరోలు సైతం మనవాళ్ళ దూకుడుకి కళ్ళెం వేయలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు సినిమాల హవానే నడుస్తుంది. ప్రస్తుతం ఇండియా వైడ్ గా అభిమానుల్లో మన సినిమాలు అంటేనే చాలా ఎక్కువ క్రేజ్ ఉంది.

    ఇక ఇలాంటి క్రమం లోనే మన తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా బాట పట్టడంతో పాన్ ఇండియాలో మన తెలుగు హీరోల క్రేజ్ ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కోలీవుడ్ మీడియాలో ప్రభాస్ పాన్ ఇండియా లో నెంబర్ వన్ హీరో అంటూ ఒక న్యూస్ అయితే వైరల్ చేస్తున్నారు. మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటే బాలీవుడ్ హీరోలకి ఒకప్పుడు సౌత్ సినిమాల పట్ల చాలా చిన్నచూపు ఉండేది.

    ఇక రాజమౌళి పుణ్యమాని బాహుబలి సినిమా రావడం తో ఒక్కసారిగా తెలుగు సినిమా క్రేజ్ కూడా భారీ స్థాయి లో పెరిగింది. అలాగే బాలీవుడ్ లో సౌత్ సినిమాల ట్రెండ్ కూడా మొదలైంది. సౌత్ నుంచి ప్రభాస్ భారీ సక్సెస్ లను అందుకుంటూ భారీ కలెక్షన్స్ ను రాబడుతున్నాడు. కాబట్టి తమిళ్ మీడియా మన మీద ప్రేమను చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే సౌత్ లో ఉన్న అన్ని ఇండస్ట్రీలకి తెలుగు సినిమా ఎదగడాన్ని వాళ్లు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.

    ఎందుకంటే బాలీవుడ్ లో సౌత్ సినిమా హావా మొదలైంది. లేకపోతే మాత్రం ఇంకా బాలీవుడ్ డామినేషన్ నడుస్తూ ఉండేది… ఇక ఇప్పుడు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలు గా కొనసాగుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి తో తీయబోయే సినిమా తో మహేష్ బాబు ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకుబోతున్నాడనే విషయం అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది.