Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” నుంచి బిగ్ అప్డేట్… ముహూర్తం, షూటింగ్ ఎప్పుడంటే ?

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత రాజకీయాల నుంచి సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన విశయం అందరికీ తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా చేతిలో 4 సినిమాలు ఉంచుకొని అభిమానుల‌ను అలరించేందుకు సిద్దమయ్యారు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య’ షూటింగ్​ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు. అలానే “గాడ్ ఫాదర్” సినిమా సూటింగ్ లో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 9, 2021 9:27 am
Follow us on

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత రాజకీయాల నుంచి సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన విశయం అందరికీ తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా చేతిలో 4 సినిమాలు ఉంచుకొని అభిమానుల‌ను అలరించేందుకు సిద్దమయ్యారు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య’ షూటింగ్​ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు. అలానే “గాడ్ ఫాదర్” సినిమా సూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. మరో వైపు ఇటీవలే బాబీ తో చేయబోయే సినిమాకు ముహూర్తం కూడా జరిగింది. అలానే  మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు చిరు.

త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాళం అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా “భోళా శంక‌ర్’ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చేసింది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఈ నెల 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లుగా ప్రకటించాడు దర్శకుడు మెహర్ రమేష్.

ఇప్ప‌టికే భోళా శంకర్ లుక్ టెస్ట్.. ఫోటో షూట్ స్టార్ట్ చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెహర్ రమేష్ గతంలో డైరెక్ట్ చేసిన కంత్రి, శక్తి, షాడో వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి.  ఈ చిత్రంతో అయిన మెహర్ మంచి విజయం సాధించాలని చిరు అభిమానులు కోరుకుంటున్నారు.