https://oktelugu.com/

poonam: మరోసారి పోలీసు స్టేషన్​కు పూనమ్​.. భర్తపై కేసు నమోదు!

poonam: బాలీవుడ్​ నటి పూన్​ పాండె, ఆమె భర్త సామ్ బాంబెలు ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాజాగా, సామ్​ బాంబే తనపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలైంది పూనమ్​. దీంతో అతనిపై పూన్​ పాండే బాంద్రా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు బాంబేను అరెస్టు చేశారు. పూనమ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు.. సామ్​ తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గొడప […]

Written By: , Updated On : November 9, 2021 / 09:28 AM IST
Follow us on

poonam: బాలీవుడ్​ నటి పూన్​ పాండె, ఆమె భర్త సామ్ బాంబెలు ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాజాగా, సామ్​ బాంబే తనపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలైంది పూనమ్​. దీంతో అతనిపై పూన్​ పాండే బాంద్రా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు బాంబేను అరెస్టు చేశారు. పూనమ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు.. సామ్​ తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గొడప మొదలైంది. దీంతో సామ్​కు కోపం వచ్చి.. పూనమ్​ జుట్టు పట్టుకుని.. తలను గోడకు బలంగా కొట్టాడు. అంతే కాకుండా.. పూనమ్​ ముఖంపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో పూనమ్​కు ఓ  కన్ను దెబ్బతినడంతో పాటు, ముఖంపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే, పూనమ్​ పోలీసులను ఆశ్రయించగా.. బాంద్రా పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. సామ్​ను అరెస్టు చేసి ఈ కేసుపై మరింత లోతుగా విచారిస్తున్నారు.

poonam-pandey-again-went-police-station-to-case-a-file-against-her-husband

కాగా, ముంబయి పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పునమ్​ పాండే ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఆమెకు తగిలిన గాయాలకు సంబంధించి పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పూనమ్​, సామ్​ల గొడవ ఇప్పుడు కొత్తేం కాదు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే వీరిద్దరికి గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచే పోలీసు స్టేషన్​ మెట్లు ఎక్కడం సర్వసాధారణం అయ్యింది. గతంలోనే ఇలాగే తన భర్త హిసించాడని పోలీసులను ఆశ్రయించింది పూనమ్​.