https://oktelugu.com/

Pushpa Movie: “పుష్ప”లోని “ఊ అంటావా… ఊహు అంటావా” సాంగ్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్…

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 03:15 PM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లోని ఒక ఐటమ్ సాంగ్ లో టాలీవుడ్ బ్యూటీ సమంత స్టెప్పులేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పుష్ప సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

    item song from allu arjun pushpa movie releasing on today

    Also Read: 2021లో మృతిచెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు..!

    ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ విడుదలకు ముహూర్తాన్ని చిత్ర బృందం ఖరారు చేసేంది. “ఊ అంటావా… ఊహు అంటావా” అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు విడుదల… చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ స్పెషల్ నంబర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

    https://twitter.com/PushpaMovie/status/1469229170081218562?s=20

    Also Read: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..