Shruti Haasan Comments On Vijay: తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ(TVK Party) అధినేత విజయ్(Thalapathy Vijay) రీసెంట్ గా కరూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట ఘటన జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ రాజకీయాల్లో సంచలన టాపిక్ గా మారింది. ఇప్పటికీ ఈ ఘటన వేడి ఇంకా తగ్గలేదు. తమిళనాడు ప్రైమ్ నెస్ చానెల్స్ లో దీనిపై ప్రత్యేక కథనాలు, డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటన పై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందించారు. విజయ్ కి మద్దతుగా సినీ ఇండస్ట్రీ లో ఎవ్వరూ నిలబడలేదు, అదే విధంగా ఆయనపై తీవ్రమైన విమర్శలు కూడా ఎవ్వరూ చేయలేదు. కానీ తమిళ హీరోయిన్, కమల్ హాసన్(Kamal Haasan) కుమార్తె శృతి హాసన్(Sruthi Haasan) రీసెంట్ ఈ ఘటన ని పరోక్షంగా ఉద్దేశిస్తూ విజయ్ ని జోకర్ తో పోలుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ రూపం లో అప్లోడ్ ఒక పోస్ట్ పెను దుమారమే రేపుతోంది.
సోషల్ మీడియా లో నెగిటివ్ కామెంట్స్ భారీగా రావడం తో ఆమె వెంటనే ఆ స్టార్ ని తొలగించింది. ఆమె మాట్లాడుతూ ‘ఓ జోకర్ ఆలస్యంగా సర్కస్ కి వెళ్లడం వల్లే ఘోరం జరిగింది. విజయ్ రీసెంట్ గా జరిగిన కరూర్ ఘటనలో జోకర్ గానే నడుచుకున్నారు. దీనికి విజయ్ ని తప్పుబట్టడం కరెక్ట్ కాదు, ఆ సర్కస్ చూసేందుకు వెళ్లిన జనాలదే తప్పు’ అనే అర్థం వచ్చేలా పరోక్ష కామెంట్స్ చేసింది శృతి హాసన్. చూస్తుంటే శృతి హాసన్ జరిగిన ఈ ఘటన పై విజయ్ మీద ఫుల్ ఫైర్ తో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్లిద్దరు కలిసి గతం లో పులి అనే చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాలేదు.