Devara Trailer: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూసారో, ఆడియన్స్ కూడా అంతలా ఎదురు చూసారు. అయితే రెగ్యులర్ కొరటాల శివ సినిమాలు ఎలా ఉంటాయో, ఈ ట్రైలర్ ని చూసినప్పుడు కూడా అదే పాత తరహా కొరటాల సినిమా స్టైల్ అనిపించింది. చాలా నీరసంగా స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కూడా సాగనుంది అని కొరటాల శివ ఫ్యాన్స్ కి ముందుగా ఒక హింట్ ఇచ్చేసాడు. అయితే ఇంతకు ముందు కొరటాల శివ సినిమాలు నీరసంగా స్క్రీన్ ప్లే తో సాగాయి అని మన ఆడియన్స్ కి అనిపించినప్పటికీ, బలమైన కాన్సెప్ట్స్ అవ్వడం వల్ల అవి కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. కానీ ‘దేవర’ చిత్రం కాన్సెప్ట్ లో కొత్తదనం కనిపించలేదు. ఎన్టీఆర్ తండ్రి పాత్రను విలన్ సైఫ్ అలీ ఖాన్ చంపేస్తాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొడుకు అతనిపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే స్టోరీ లాగా అనిపించింది ఈ ట్రైలర్ ని చూస్తే.
ఇందులో ఎన్టీఆర్ కొడుకు పాత్ర ‘వర’ చాలా అమాయకత్వంతో కూడుకున్నది గా అనిపించింది. అయితే అమాయకుడైన ఒక హీరో తిరగబడిన క్షణం ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో మన దర్శక నిర్మాతలు ఇది వరకు సినిమాల్లో సన్నివేశాలను తీర్చి దిద్దారు. ‘దేవర’ చిత్రం లో కూడా కొరటాల శివ అలాంటి సన్నివేశాలు రాసుకొని ఉండుంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ వేట ఆకాశమే హద్దు అనే విధంగా ఉంటుంది. అంతే కాకుండా కొరటాల శివ ఈ ట్రైలర్ లో చాలా అంశాలు పూర్తిగా రెవీల్ చెయ్యకుండా వదిలాడు. రెండేళ్ల నుండి ‘దేవర’ సముద్రంలోకి వెళ్ళలేదు అంటే, ‘దేవర’ క్యారక్టర్ బ్రతికే ఉందా అనే అనుమానాలు తలెత్తాయి. అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎదో చూసి భయపడుతాడు, అతను అలా భయపడడానికి కారణం ఏమిటి? అనేది కూడా ఆసక్తికరమైన అంశం. సముద్రం అడుగున స్కెలిటన్స్ కూడా ఉంటాయి.
చూస్తుంటే కొరటాల శివ కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ ట్రైలర్ చూసినప్పుడు ఆ కొత్తదనం మిస్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, నిర్మాత కళ్యాణ్ రామ్ ఖర్చు కి ఎక్కడా వెనకాడినట్టు అనిపించలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేదు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూడు అద్భుతమైన పాటలు అందించిన తర్వాత,, ఆయన నుండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిని ఆశిస్తారు అభిమానులు. కానీ ఆ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆయన ఈ ట్రైలర్ కి ఇచ్చినట్టు అనిపించలేదు, సినిమాలో ఏమైనా దాచిపెట్టాడేమో చూడాలి.