Devara Trailer: గత మూడు సంవత్సరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆయన ఈ సినిమాను చేయడం లో గల ముఖ్య కారణం ఏంటి అంటే కొరటాల ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ కి ‘జనతా గ్యారేజ్’ అనే ఒక సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాని అందించాడు. అందువల్లే తనకు మరొకసారి ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశ్యంతో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కు ఒక మంచి అవకాశం ఇద్దం అనుకున్నాడు. ఇక కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాడా లేదా అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిసేపటికి క్రితం రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ని కనక చూసినట్లయితే ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా మాత్రం ఇది కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా మీద ఎన్టీయార్ కి మొదటి నుంచి నమ్మకం లేనట్టుగా తెలుస్తుంది. అందుకే తను ఈ సినిమాను చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టుగా చేశాడు తప్ప భారీ సక్సెస్ అందుకుంటుందనే ఉద్దేశంలో అయితే ఎన్టీఆర్ లేనట్టుగా తెలుస్తుంది.
అందుకోసమే నెక్స్ట్ వెంటనే ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమాని సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఎన్టీఆర్ పేరు పాన్ ఇండియా లో మారు మ్రోగుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఇక ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ ను నమ్ముకోవడమే బెటర్ అని అతనితో పట్టుబట్టి మరి సినిమాని సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి కొరటాల శివ ఎందుకు ఇలాంటి ఒక నాసిరకం కథతో సినిమా చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దేవర ట్రైలర్ చూసినట్లయితే అందులో అసలు మ్యాటర్ కనిపించడం లేదు. స్టోరీని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే చాలా చండాలంగ ఉంది అంటూ సినీ విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా స్టోరీని రొటీన్ గా రాసుకొని బ్యాక్ డ్రాప్ ను మాత్రం కొత్తగా ఎంచుకొని సినిమాని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే అది చాలావరకు వర్కౌట్ కాని వ్యవహారం అని ఇంతకు ముందు వచ్చిన చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.
ఇక ఇప్పుడు కొరటాల శివ మళ్ళీ అదే సెటప్ ని తీసుకొని సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ స్టార్ హీరో లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది చాలా వరకు తప్పు… ఎందుకంటే అతని అభిమానులను సాటిస్ఫై చేయడంలో ఇలాంటి ఎక్స్పరమెంట్లు చాలా వరకు మొండి చేయి చూపిస్తాయనే చెప్పాలి. మరి కొరటాల ఎంచుకున్న సెటప్ గాని ఆయన ఈ సినిమా మీద పెట్టిన ఎఫర్ట్స్ గానీ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. అయినప్పటికి ఈ సినిమా మాత్రం సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా అయితే ఉండబోదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…