https://oktelugu.com/

Devara Trailer: దేవర ట్రైలర్ లో క్లారిటీ మిస్ అయిందా..? దీనికి కారణం ఎవరు..?

ఎన్టీయార్ లాంటి హీరో ఒక సినిమా చేస్తున్నాడంటే అందులో చాలా వరకు వైవిధ్యం అయితే ఉంటుంది. ఇప్పటికే వరుసగా 6 సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఎన్టీయార్ ఇప్పుడు 7 వ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 10, 2024 / 05:48 PM IST

    Devara

    Follow us on

    Devara Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీయార్లు ఉన్నారనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ తండ్రి కొడుకులు గా ఈ సినిమాలో నటించబోతున్నారనేది మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. కానీ కథపరంగానే సినిమాలో చాలా కాన్ఫిక్ట్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ట్రైలర్ లో చెప్పిన కథ సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా అయితే లేదు.

    అలాగే ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ నింపేసినప్పటికీ ట్రైలర్ ను ఒక సీక్వెన్స్ లో మాత్రం ఇవ్వలేదు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్రైలర్ మీద భారీ ఆశాలైతే పెట్టుకున్నారు. డైలాగులు బాగున్నప్పటికీ వాటి ప్లేస్మెంట్ కూడా అంతా బాగా ఎస్టాబేస్ అయితే అవ్వలేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మరోసారి అనిరుధ్ నిరాశపరచాడనే చెప్పాలి. ఇక కొరటాల ఈ సినిమాలో ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్ గా ట్రైలర్లు మాత్రం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలేదని చెప్పాలి. ట్రైలర్ అధ్యంతం కన్ఫ్యూజన్ తో సాగుతుంది తప్ప, క్లారిటీ అయితే ఎక్కడ లేదు.

    ఇక విజువల్స్ కొంతవరకు బాగున్నాయి అనిపించినప్పటికీ అక్కడక్కడ గ్రాఫిక్స్ వర్క్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇక ప్రకాష్ రాజ్ బ్యాక్ డ్రాప్ లో ట్రైలర్ ని ఓపెన్ చేసి దేవర కథని చెప్పిన విధానం అయితే బాగానే ఉంది. అయినప్పటికీ ట్రైలర్లో మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. సినిమా మీద ఎన్టీఆర్ కొరటాల ఇచ్చిన హైప్ ఈ ట్రైలర్ కి అసలు మ్యాచ్ అవ్వలేదనే చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ కి మరొక 15 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం అయితే చేశారు.

    కానీ ట్రైలర్ మాత్రం ఏమాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా అయితే లేదు. ఇంకా ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ రెండు గెటప్స్ లో కనిపించాడు. వాటిలో ఎన్టీయార్ చాలా అద్భుతంగా అనిపించాడు. అయినా కూడా డైరెక్టర్ ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం అయితే ఎవరికి నచ్చడం లేదు. ఇక ఇదిలా ఉంటే దేవర మూవీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…